Monday, January 20, 2025
HomeదైవంHyderabad-Rath Yatra: హైదరాబాద్ లో పూరి జగన్నాథ రథయాత్ర

Hyderabad-Rath Yatra: హైదరాబాద్ లో పూరి జగన్నాథ రథయాత్ర

రథయాత్రలో సీఎం రేవంత్

జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అందరిదన్న సీఎం రేవంత్ సర్వమతాలకు స్వేచ్ఛ, అవకాశాలను ఇస్తుందన్నారు. మా ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుందని ఆయన వెల్లడించారు.

- Advertisement -

ఇస్కాన్ సంస్థ ప్రార్ధనలతో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని చెప్పిన రేవంత్, మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు, ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని, ఎన్టీఆర్ స్టేడియం వద్ద శ్రీ జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇస్కాన్ టెంపుల్ అబిడ్స్, హైదరాబాద్ ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టగా ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు రథయాత్ర కొనసాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News