జ్యోతిష్యం లేదా అస్ట్రాలజీ (Astrology) అనేది ప్రాచీన భారతీయ సంస్కృతుల్లో ప్రసిద్ధి చెందిన ఒక శాస్త్రం. ఇది గ్రహాలు, నక్షత్రాలు మరియు వారి స్థితులు, గమనాలు మనిషి జీవితం, భవిష్యత్తు, ప్రాప్తి పై ప్రభావం చూపుతాయని చాలామంది భావిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. రాశి చక్రం (Zodiac) ను 12 రాశులుగా విభజిస్తారు. కుండలి (Horoscope) ద్వారా ఒక వ్యక్తి భవిష్యత్తును ఊహిస్తారు. అంతేకాదు జీవితంలో ఎదుగుదల, ఆర్థిక అభివృద్ధి, వివాహానికి గ్రహ బలాలు కారణమని పండితులు అంటున్నారు. ఇక జాతకంలో ఈ నాలుగు గ్రహాలు బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో లవ్ ఫెయిల్యూర్ అవుతుందని పండితులు అంటున్నారు.
జ్యోతిషశాస్త్రంలో 9 గ్రహాలకు వేర్వేరు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాల కారణంగానే జీవితంలో ఒడిదుడుకులు, అభివృద్ధి ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఇక ప్రేమ వివాహం చేసుకొని.. వైవాహిక జీవితం ప్రశాంతంగా గడిపే జంటలు చాలా ఉన్నాయి. అయితే గాఢంగా ప్రేమించుకున్నా.. పెళ్లి తర్వాత చిన్న చిన్న సమస్యలకే విడిపోయే కొందరు విడిపోతుంటారు. ఏ గ్రహం యొక్క బలహీనత కారణంగా మన సంబంధాలు సమస్యలను ఎదుర్కుంటుందని పండితులు అంటున్నారు. ఎన్నో సంబంధాలు తెగిపోవడానికి కారణం జాతకంలో బలహీనమైన గ్రహాలేనని పండితులు చెబుతున్నారు.
ఒక వ్యక్తి జాతకంలో శుక్ర గ్రహం బలహీనంగా ఉంటే.. అతని భాగస్వామితో అనోన్యంగా ఉంటాడని అర్థమంట. అదే శుక్రుడు బలహీనంగా ఉంటే వారి జీవితంలో శృంగారం లోపిస్తుందంట.. వీరు తమ భాగస్వామితో కూడా కలిసి ఉండలేరని పండితులు చెబుతున్నారు. అందుకే జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే, దానిని బలోపేతం చేయడానికి ప్రయత్నించాలి… దానికి తగ్గ పరిహారాలు చేసుకోవాలి.
ఇక జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే మీ గౌరవానికి భంగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దీని కారణంగా మీరు తమ భాగస్వామికి విశ్వసనీయంగా ఉండరంట. అంటే వీరిని వారి భాగస్వామి నమ్మదు. బృహస్పతి వివాహం, సంబంధాలకు చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే.. అటువంటి వ్యక్తి యొక్క సంబంధం ఎక్కువ కాలం ఉండదు. తద్వారా ఆ బంధం తెగిపోతుందని చెబుతున్నారు.
ఇక జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే.. భాగస్వామిని సంతోషంగా ఉంచలేరంట. బలహీనమైన బుధుడు అనేక ప్రేమ సంబంధాలు నాశనం కావడానికి కూడా కారణం కావచ్చని చెబుతున్నారు. బుధుడు బలహీనంగా ఉండటం వలన అవసరమైన గౌరవం, ప్రేమ ఇవ్వలేకపోతుంటారంట. దీంతో రిలేషన్ బ్రేకప్ అవుతుందని చెబుతున్నారు పండితులు. ఇక జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే, మీ మామగారితో మీ సంబంధం మెరుగుపడకపోవచ్చు అంటున్నారు పండితులు. ప్రియురాలి తండ్రి లేదా అన్నయ్యతో గొడవలు వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. దీని ఆధారంగా గర్ల్ ఫ్రెండ్ మీతో విడిపోవచ్చు లేదా విభేదాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పండితులు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)