అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన హుండీలను సోమవారం దేవాదాయ శాఖ పర్యవేక్షకులు సత్యనారాయణ సమక్షంలో లెక్కించారు. మార్చి నెల నాలుగో తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 34 హుండీల ద్వారా రూ.21,28,150ల నగదుతో పాటు 18 గ్రాముల మిశ్రమ బంగారం, 320 గ్రాముల మిశ్రమ వెండిని శ్రీ సీతారాములకు కానుకల రూపంలో భక్తులు సమర్పించినట్లు ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు.
హుండీల లెక్కింపులో ఆలయ అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధరాచార్యులు, స్థానిక సర్పంచ్ కంకణాల శ్రీలత సురేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి, శ్రీ రామ సేవా సమితి, కల్కి సేవా సమితి సభ్యులు, ఆలయ ఉద్యోగులు మోహన్, రవి, రాజయ్య, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.