Saturday, November 15, 2025
HomeదైవంKarthika Masam: కార్తీక మాసంలో ఈ దానాలు కానీ చేశారంటే...కోటి అశ్వమేధ యాగాలు చేసినట్లే

Karthika Masam: కార్తీక మాసంలో ఈ దానాలు కానీ చేశారంటే…కోటి అశ్వమేధ యాగాలు చేసినట్లే

Karthika Masam- Donation:పరమ పవిత్రమైన కార్తీక మాసం మధ్యలోకి చేరింది. ఈ నెలలో ప్రతి ఇంటా దీపాలు వెలుగుతాయి, దేవాలయాల్లో శివనామస్మరణ మార్మోగుతుంది. ఈ మాసం అంతా శివకేశవుల ఆరాధన, ఉపవాసాలు, పుణ్యస్నానాలు, దానధర్మాలతో ఆధ్యాత్మికత నిండిపోతుంది. కొందరు పనుల ఒత్తిడితో లేదా ఇతర కారణాలతో కార్తీక వ్రతాలను పూర్తిగా ఆచరించలేకపోవచ్చు. అలాంటి వారు ఈ నెల పూర్తికాకముందే కొన్ని ప్రత్యేక దానాలు చేస్తే వ్రతాన్ని ఆచరించినంత ఫలితాన్ని పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

- Advertisement -

కార్తీక మాసం హరిహరులకు అత్యంత ప్రీతికరమైన నెలగా పరిగణిస్తారు. ఈ మాసంలో దానం చేయడం ద్వారా పాపాలు తొలగి, మోక్షానికి దారివస్తుందని పురాణాలు పేర్కొన్నాయి. ఈ నెలలో చేసే ప్రతి దానం ప్రత్యేకమైన ఫలితాన్ని అదిస్తుంది.

Also read:https://teluguprabha.net/devotional-news/vastu-secrets-for-staircase-placement-in-home/

దీపదానం ప్రాధాన్యం

కార్తీక మాసంలో దీపదానానికి అత్యంత ఆధ్యాత్మిక స్థానం ఉంది. ఈ కాలంలో శివాలయాలు, విష్ణుమందిరాల్లో దీపాలను వెలిగించి వాటిని భక్తి శ్రద్ధలతో దానం చేస్తే కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. పేదరికం, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శాస్త్రాల ప్రకారం దీపదానం చేసినవారికి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి.

అన్నదానం పుణ్యం

హిందూ ధర్మంలో అన్నదానం అన్ని దానాలలో శ్రేష్ఠమైనదిగా చెబుతుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం ద్వారా అశేష పుణ్యం లభిస్తుంది. నదీ తీరాలు, దేవాలయ పరిసరాల్లో అన్నదానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం వస్తుందని శాస్త్ర వచనం చెబుతోంది. ఈ మాసంలో అన్నదానం చేసినవారి కుటుంబాలు దారిద్య్రం లేకుండా సుఖశాంతులతో జీవిస్తారని విశ్వాసం.

వస్త్రదానం ఫలితం

కార్తీక మాసంలో పేదలకు వస్త్రాలు దానం చేయడం అత్యంత శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. పాత వస్త్రాల కంటే కొత్త వస్త్రాలను ఇచ్చినవారికి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వసిస్తారు. ఇలాంటి దానాలు వంశాభివృద్ధికి దోహదం చేస్తాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.

ఉసిరి దానం ప్రాముఖ్యత

కార్తీక మాసం ఉసిరి చెట్టుతో ప్రత్యేకంగా అనుబంధమై ఉంది. ఉసిరి చెట్టును పూజించడం, ఉసిరి పండ్లు దానం చేయడం పుణ్యప్రదమని చెబుతారు. పురాణాలలో ఓ పేద మహిళ శివుడికి ఎండిన ఉసిరికాయలు సమర్పించి ఐశ్వర్యం పొందిందని కథ ఉంది. అందుకే ఈ నెలలో ఉసిరి దానం భగవత్ ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఉసిరి దానం చేసినవారికి ధనవృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం.

సాలగ్రామ దానం ప్రాముఖ్యత

సాలగ్రామం విష్ణువు చిహ్నంగా పూజించే శిల. ఇది భక్తుల ఇళ్లలో దేవతార్చనలో తప్పనిసరి భాగంగా ఉంటుంది. కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో సద్బ్రాహ్మణులకు సాలగ్రామాన్ని దానం చేస్తే అద్భుత పుణ్యం లభిస్తుందని స్కంద పురాణం పేర్కొంటుంది. ఇది గంగా స్నానం చేసిన ఫలితానికి కూడా మించి పుణ్యప్రదమని చెబుతారు. సాలగ్రామ దానం చేసినవారికి జన్మ జన్మార్జిత పాపాలు తొలగి విశేష ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయి.

కన్యాదానం మహత్త్వం

కార్తీక మాసంలో కన్యాదానం అత్యంత పుణ్యకార్యంగా చెబుతుంటారు. వివాహానికి సిద్ధమైన కన్యను సకల ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి వివాహం చేయడం ద్వారా ఆ కుటుంబానికి కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు పేర్కొంటాయి. కన్యాదానం చేసిన వంశంలో పాపభారం ఉండదని, వారు దేవతల కృపకు పాత్రులవుతారని విశ్వాసం.

Also Read: https://teluguprabha.net/lifestyle/solar-eclipse-2026-date-visibility-and-complete-details/

దానధర్మాల ఆచరణ ప్రాముఖ్యత

కార్తీక మాసంలో దానం చేయడం కేవలం సంప్రదాయం కాదు, అది ఆత్మశుద్ధికి దారి తీసే మార్గం. ప్రతి దానం వెనుక ఆధ్యాత్మికత దాగి ఉంటుంది. ఈ నెలలో దానం చేసిన ప్రతి మనిషి సద్గుణాలతో, శాంతితో జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. శివుడు, విష్ణువు సంతోషించేవిధంగా మన శక్తి మేరకు దానధర్మాలు చేయడం ద్వారా పాపాలు కరిగిపోతాయని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad