Sunday, October 6, 2024
HomeదైవంAhobilam: 33 గ్రామాలలో 43 రోజులు తిరిగే స్వామి

Ahobilam: 33 గ్రామాలలో 43 రోజులు తిరిగే స్వామి

అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి పారువేట ఉత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పారువేట ఉత్సవాలు మంగళవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎగువ అహోబిలం ఉత్సవమూర్తి శ్రీ జ్వాలా నరసింహస్వామి, దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారు పల్లకిలో 33 గ్రామాలలో 43 రోజులపాటు పర్యటించి తమ వివాహానికి ప్రజలను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నది. మంగళవారం రాత్రి స్వామి పల్లకి కొండ దిగి ముందుగా బాచేపల్లి గ్రామాన్ని చేరుకుంటుంది. బాచెపల్లి గ్రామంలో రేపటినుండి మొదలై చివరి మజిలీగా ఫిబ్రవరి 28న రుద్రవరం గ్రామానికి చేరుకుంటారు. పార్వేట ఉత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం దిగువ అహోబిలం క్షేత్రంలో ఉత్సవ శోభ నెలకొంది. ఎగువ అహోబిలం శ్రీ జ్వాల నరసింహ స్వామి, దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి ఉత్సవమూర్తులను పల్లకిలో అలంకరించి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీదేవిని తమ ఆడపడుచుగా భావించే చెంచులు, గిరిజనులు పల్లకి వద్ద నృత్యాలు చేస్తూ .. విల్లంబులు ధరించి బాణాలను వదులుతూ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆళ్లగడ్డ డిఎస్పి వెంకటరామయ్య ఆధ్వర్యంలో రూరల్ సీఐ హనుమంత నాయక్, రూరల్ ఎస్సై నరసింహులు సిబ్బందితో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఊరేగింపులో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తుల గోవింద నామ స్మరణలు చేస్తుండగా బోయులు పారువేట పల్లకిని మోస్తూ బాచుపల్లి గ్రామం కి చేరుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News