కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి కల్యాణం వేదపండితుల వేదమంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగింది. కల్యాణానికి, రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీవీరభద్రస్వామి ఆలయంలో అంకురార్పణం, ధ్వజారోహణ, స్వామివారికి రుద్రాభిషేకం, గవ్యాంతం, నిత్యౌపాపన, నిత్యహోమం, వాస్తుపూజ, వాస్తుహోమం, వాస్తుబలి, ఉపనిషత్ పారాయణం, ప్రదోశకాల పూజ, గణపతి పూజ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సమక్షంలో పల్లకీలో తీసుకువచ్చారు. స్వామి కల్యాణం సందర్భంగా వీరభద్రస్వామి పక్షాన ప్రధాన అర్చకుడు రాజయ్య, మొగిళిపాలెం రాంబాబు, వినయ్‌శర్మ, శివకుమార్, రమేష్, శ్రీకాంత్, శరత్‌చంద్రలు భద్రకాళి సమేతులైన వీరభద్రస్వామి-భద్రకాళి అమ్మవార్లకు జీలకరబెల్లం పెట్టి కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం మాంగళ్యధారణ, అక్షతరోపాణం, దివ్యనీరాజనం, మంత్రపుష్పాలు, మహాదాశీర్వచనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారి కల్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. ఆలయ ఈవో కిషన్‌రావు, కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్ కుమార్, ముల్కనూర్, ఎల్కతుర్తి, వేలేరు ఎస్‌ఐలు సాయిబాబు, రాజ్ కుమార్, హరితతో పాటు పలువురు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
తరలివచ్చిన మహిళలు
స్వామివారి కల్యాణానికి గతంలో ఎప్పుడూ లేనివిధంగా మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణాలన్ని కిటకిటలాడాయి. కార్యక్రమంలో , కొత్తకొండ గ్రామ సర్పంచ్ దూడల ప్రమీల సంపత్, ఎంపీపీ జక్కుల అనిత, ఎంపిటిసిలు యాటపోలు రాజమణి శ్రీనివాస్, అప్పని పద్మ, తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ , జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి,చిదురాల స్వరూప, ఊసకోయిల ప్రకాష్, చంద్రశేఖర్ గుప్తా, కాసం రమేష్, గోపిశర్మ, చిట్టంపల్లి ఐలయ్య, బొజ్జపూరి, అశోక్ ముఖర్జీ, పొన్నాల మురళి, లక్ష్మారెడ్డి, ఆదరి రవి, పోగుల శ్రీకాంత్, చిట్కూరి అనిల్ , జక్కుల అనిల్, తదితరులు పాల్గొన్నారు.