శ్రీరామ జన్మ భూమి తీర్ధక్షేత్రం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు గార్ల మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో భక్తులు ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం నుంచి స్వామి వారి అక్షింతలు కలిశం చెంబును రామ భక్తులు నెత్తిన ఎత్తుకుని సీతంపేట, కస్నా తండా, మంగళి తండా, బదిలి తండా, అంకన్న గూడెం తండా పుర వీదుల్లో శ్రీరామ నామస్మరణతో డిజే పాటలతో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు భక్తి పాటలకు సృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తిరునగరి యాదగిరి స్వామి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను గార్ల మండల కేంద్రంలోని స్థానిక పట్టణ పురవీధులలో భక్తులు పంపిణీ చేశారు. తొలుత భవాని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి స్వామివారి అక్షతల కలశం చెంబును రామభక్తులు నెత్తిన ఎత్తుకొని మెయిన్ రోడ్ ఎమ్మార్వో ఆఫీస్ రోడ్ శివాలయం వీధి లోని ఇంటింటికి తిరుగుతూ శ్రీరామ నామస్మరణను జపిస్తూ అక్షితలను పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా విశాల్ జైన్ కమల్ అగర్వాల్ కట్ట రమేష్ లు మాట్లాడుతూ గ్రామ ప్రజలు రాములవారి అక్షితలను నిలువ చేసుకొని ఇళ్లలో శుభకార్యాలు జరిగిన సమయంలో వినియోగించుకోవచ్చునని, ఈనెల 22న అయోధ్యలో రాములవారి మూలవిరాట్ ప్రతిష్ట పూర్తయిన తర్వాత పంపిణీ చేసిన అక్షతలను శిరస్సులో ధరించాలని, ఆరోజు సాయంత్రం తమ ఇళ్ళ ముందు ఐదు అంతకన్నా ఎక్కువ దీపాలు వెలిగించి పూజలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమిశెట్టి శ్రీనివాస్ కనక శేఖరం సారయ్య కత్తి నాగరాజ్ మనోజ్ రోహిత్ స్వామి రాహుల్ స్వామి దువ్వ సతీష్ కత్తి కౌశిక దువ్వా రిషిత్ దువ్వా యువ సంకీర్త్ అశ్విన్ భవిత మహిళలు తదితరులు పాల్గొన్నారు.