Saturday, November 23, 2024
HomeదైవంGarla: మహాశివరాత్రికి త్రికుంటేశ్వర ఆలయం ముస్తాబు

Garla: మహాశివరాత్రికి త్రికుంటేశ్వర ఆలయం ముస్తాబు

కాకతీయుల కాలంలో ఆలయ నిర్మాణం

మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని పుల్లూరు గ్రామ సమీపంలోని చెరువు తీరాన కాకతీయుల కాలంలో నిర్మించిన త్రికుంటేశ్వర ఆలయం చరిత్రకు చిహ్నంగా నిలుస్తుంది. కాకతీయ రాజులు తమ రాజ్యాన్ని విస్తరించి సుస్థిరం చేయడానికి మొదలుపెట్టిన దండయాత్ర దిగ్విజయంగా విజయం సాధిస్తూ ముందుకెళ్తూ కాక. ఆ విధంగా పుల్లూరు గ్రామ చెరువు సమీపంలో స్వయంభు శివ ఆలయాన్ని కాకతీయులు తమ విజయానికి సూచికగా ఇక్కడ నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని త్రికోణా ఆకార రూపంలో సర్వాంగ సుందరంగా నిర్మించి, శివుడు పార్వతి విఘ్నేశ్వరుని విగ్రహాలను ప్రతిష్టించటంతో పాటుగా ఏక శిల ఆలయ శాసనం రూపొందించడంతో ఈ ఆలయం త్రికుంటేశ్వర ఆలయంగా పిలవబడుతుంది.

- Advertisement -

ఆలయంలో కొలువుతీరిన శివుడికి అభిషేకం చేసేందుకు ఆలయం పక్కనే చెరువును సైతం కాకతీయులు నిర్మించారని ప్రతీతి. ఆలయం చుట్టూ పచ్చని పంట పొలాలు ఎత్తైయిన పచ్చని చెట్లు ప్రకృతి రమణీయత సౌందర్యం అందమైన పరిసరాల మధ్య చెరువు సమీపంలో కొలువైన ఈ ఆలయంలో కాకతీయుల కళావైభవానికి శిల్పకళ సంపద చరిత్రకు దర్పణం పడుతుంది. ఐదు అడుగుల ఎత్తైన సాలిగ్రామ శిలలతో ఆలయం చుట్టూరా మకర తోరణంతో పాటుగా కాకతీయుల సామ్రాజ్య వైభవ గుర్తులను శిల్పులు తీర్చి, చెక్కిన తీరు వర్ణనాతీతం. కోరిన వారికి కొంగుబంగారంగా నిత్యం పూజలు అందుకుంటూ భక్తుల ఆరాధ్య దైవంగా కొలుచుకునే ఇంతటి ఘన చరిత్ర కలిగిన పురాతనమైన ఈ త్రికుంటేశ్వర శివాలయం పాలకుల నిర్లక్ష్య వైకరి మూలంగా నిరాధారణకు గురై, కొంతకాలం ధూప దీప నైవేద్యానికి నోచుకోకపోవడంతో ఆలయం శిథిలావస్థకు చేరే సమయంలో గ్రామస్తులు యువకులు ముందుకు వచ్చి ఆలయానికి మరమ్మత్తులు చేపట్టారు.

కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శివాలయమైన త్రికుంటేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని శివాలయం సేవా కమిటీ నిర్వాహకులు ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు. కాకతీయుల కాలం నాటి నుండి భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తున్న త్రికుంటేశ్వర శివాలయం శిధిలావస్థకు చేరుకుంటున్నా దేవాదాయ శాఖ ఏం మాత్రం పట్టించుకోవడం లేదని పురాతనమైన ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచాలని గత ప్రభుత్వ హయాంలోని పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. పురాతన చరిత్ర కలిగి ఉండి ఎంతో మహిమగల త్రికుంటేశ్వర శివాలయంపై ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలకులైనా ప్రత్యేక దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు ఈ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఆలయ ప్రాకారాలు గోపురం మండపాలను వివిధ రంగులతో తీర్చిదిద్దడంతో పాటుగా ఆలయం బయట మిరమిట్లు గొలుపే విద్యుత్ దీపాలతో రకరకాల పూలతో అలంకరించడంతో ఆలయం నూతన శోభను సంతరించుకుంది. నేటికీ భక్తులకు ఇలవేల్పుగా నిలుస్తున్న పుల్లూరు త్రికుంటేశ్వర ఆలయంలో ఈనెల 7 నుంచి 9 వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

గురువారం 7 తారీఖున ఉదయం గణపతి హోమం ప్రత్యేక పూజలు అభిషేకాలు శుక్రవారం 8వ తారీకు మహాశివరాత్రి పర్వదినం రాత్రి 8 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం శనివారం 9వ తారీకున మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మహా అన్నదాన కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలతో గ్రామంలో శోభయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని శివాలయం సేవ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News