Sunday, July 7, 2024
HomeదైవంMahanandi: మహానందీశ్వరునికి వైభవంగా అన్నాభిషేకం

Mahanandi: మహానందీశ్వరునికి వైభవంగా అన్నాభిషేకం

దారిద్య్రాలు తొలగించే అన్నాభిషేకం

కార్తీక మాసం శివుని జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మహానందీశ్వర స్వామివారికి దాతల సహకారంతో అన్నాభిషేకం వైభవంగా నిర్వహించారు. గురువారం ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాతలుచే వేద పండితులు నాగేశ్వర శర్మ, శాంతారాం భట్, హనుమంతు శర్మ స్వామివారి మూల విరాట్ కు జలాభిషేకం నిర్వహించి, అనంతరం శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణతో అన్నాభిషేకాన్ని నిర్వహించారు. శివ కేశవులకు అత్యంత ఇష్టమైన ఈ కార్తీకమాసంలో స్వామివారికి అన్నభిషేకం నిర్వహిస్తే సమస్త జీవకోటి ఆహారం లోటు లేకుండా మృత్యువాత పడదని ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. మానవ జన్మ ఎత్తిన ప్రతి జీవికి జీవించాలంటే ఆహారం తప్పనిసరనీ, జీవులకు ఆహారాన్ని అందించే అన్నపూర్ణను సతిగా పొందిన ఆదిదేవుడికి అన్నాభిషేకం నిర్వహించినా లేక తిలకించినా అష్ట దరిద్రాలు తొలగి, సకల సౌకర్యాలు కలగడంతోపాటు జీవితమంతా సుఖ సంతోషాలకు లోటు ఉండదన్నారు. అనంతరం ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామి వారి మూల విరాట్ కు అత్యంత ఘనంగా నిర్వహించిన అన్నాభిషేక ప్రసాదాన్ని క్షేత్రానికి వచ్చిన భక్తులకు అన్నదానంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గంగిశెట్టి మల్లికార్జునరావు అమృత దంపతులు, ఆలయ ప్రధాన అర్చకుడు మామిళ్ళపల్లి అర్జున శర్మ, దాతలు అనంతరమణ రమాదేవి, విజయ్ కుమార్ పద్మజ, యనకండ్ల రంగస్వామి అనురాధ, వెంకటరమణ ఉషారాణి, జయరాం సుజాత, ఆనంద ప్రసాద్ చైతన్య, సుదర్శన్ కుమార్ అనిత, హనుమంత రెడ్డి అనురాధ, సాయిబాబా రెడ్డి నాగలక్ష్మి, దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News