Sunday, July 7, 2024
HomeదైవంMahanandi: ప్రతి మనిషి ప్రేమ, దయ, శాంతి, సద్గుణాలు కలిగి ఉండాలి

Mahanandi: ప్రతి మనిషి ప్రేమ, దయ, శాంతి, సద్గుణాలు కలిగి ఉండాలి

కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి

మనిషి మానవ జీవితంలో ప్రేమ, దయ, శాంతి, సద్గుణ లక్షణాలు కలిగి ఉండాలని జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు పేర్కొన్నారు. కంచి కామకోటి పీఠం విజయ యాత్ర మహానంది క్షేత్రంకు చేరుకోగా.. ముందుగా ఆయనకు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

అనంతరం స్వామివారు మహానంది ఆలయంలోని అభిషేక మండపంలో శ్రీ శారద చంద్రమౌళిశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం మహానందిలోని పోచ విశ్రాంతి భవనంలో భక్తులకు ప్రవచనాలు వినిపించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహానంది పుణ్యక్షేత్రం ఎంతో విశిష్టత కలిగిన ఆలయం అని అన్నారు. మన భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆచారాలకు నిలయం అని అన్నారు. భారత దేశం సనాతన ధర్మం వైపు ప్రయాణిస్తుండదన్నారు. ప్రతి ఒక్కరు రమణీయంగా, కలుషితం లేకుండా స్వచ్ఛంగా జీవించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలను నేర్పించాలన్నారు.

ప్రతి శని, ఆదివారాల్లో దేవాలయాల విశిష్టత, ధర్మ సూత్రాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జడ్జి ఎం శ్రీనివాసరావు, నంద్యాల జిల్లా ఆదినారాయణ, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పలువురు ప్రమఖులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News