Sunday, October 6, 2024
HomeదైవంRamadugu: గుండి గ్రామంలో ఇంటింటికి అయోధ్య అక్షంతల వితరణ

Ramadugu: గుండి గ్రామంలో ఇంటింటికి అయోధ్య అక్షంతల వితరణ

ఇంటింటికీ అయోధ్య అక్షితలు

రామడుగు మండలం గుండి గ్రామంలో ఇంటింటికి రామజన్మభూమి అక్షింతలను పంపిణీ చేశారు. అయోధ్య నుంచి తీసుకు వచ్చిన అక్షింతలకు, రాములోరి కరపత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాముని ఫోటోని, అక్షింతలను ఇంటింటికి తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీ బాల రాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ప్రతి ఇంట్లో దీపావళి పండుగలా జరుపుకొని సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని కోరారు. ఇంటింటికి అక్షింతలను పంపిణీ చేస్తున్న సమయంలో ప్రతి ఇంటి నుండి మహిళలు మంగళహారతులతో అక్షింతలు పంపిణీ చేసే వారికి ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానస ప్రవీణ్, ఉప సర్పంచ్ మేడి శ్రీనివాస్ గౌడ్ ,మాజీ సర్పంచ్ రావుల రాజయ్య, వార్డు మెంబర్ మేడి మహేష్, గౌడ సంఘం అధ్యక్షులు రంగు రాములు గౌడ్, విద్య కమిటీ చైర్మన్ పొన్నం శ్రీనివాస్ గౌడ్, ముంజాల ప్రవీణ్ గౌడ్, ముంజాల రాములు గౌడ్,గోల్లే సుదర్శన్ ,గోదరి కనకయ్య, బండారి శ్రీనివాస్, మానుపాటి వెంకటేష్ ,పొన్నం అభిషేక్, పొన్నం పరశురాములు గౌడ్ ,రంగు లచ్చయ్య, మచ్చ మహేష్ ,మచ్చ ఆశయ్య ,మంద రాజశేఖర్ , బొమ్మరవేణి శ్రీనివాస్ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News