Friday, November 22, 2024
HomeదైవంRudravaram: అహోబిలం నారసింహ పార్వేటకు చిలకలూరు స్వాగతం

Rudravaram: అహోబిలం నారసింహ పార్వేటకు చిలకలూరు స్వాగతం

చందలూరు భక్తుల పూజలు

మండల పరిధిలోని చందలూరు గ్రామంలో ఉత్సవమూర్తులకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. పారువేట ఉత్సవాలలో భాగంగా గ్రామానికి చేరుకున్న శ్రీ జ్వాల నరసింహ స్వామి శ్రీ ప్రహ్లాద వరద స్వామి ఉత్సవ మూర్తులు కొలువుదీరిన పారువేట పల్లకి గ్రామంలోని ఆయా తెలుపులపై కొలువుదీరగా తెలుపుల కుటుంబాలతోపాటు భక్తాదులు కొబ్బరికాయలు పూలమాలలు పూజా సామాగ్రి సమర్పించుకోగా పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు తనివితీరా దర్శించుకున్నారు.

- Advertisement -
  • ఉత్సవ మూర్తులకు ఘన స్వాగతం పలికిన చిలకలూరు గ్రామస్తులు…

పారువేట ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోకి చేరుకున్న ఉత్సవమూర్తులకు గ్రామస్తులు గ్రామంలోకి ఘన స్వాగతం పలికారు. గ్రామ పెద్దలు గ్రామస్తులు పారువేట పల్లకి వద్దకు ఎదురు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలతో గ్రామంలోకి ఆహ్వానించగా శ్రీ జ్వాల నరసింహ స్వామి శ్రీ ప్రహ్లాద వరద స్వామి కొలువుదీరిన పారువేట పల్లకిని బోయలు గ్రామంలోకి చేర్చారు. దీంతో గ్రామంలో తిరుణాల వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News