First surya Grahanam in 2026: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, మంగళవారం నాడు సంభవించబోతుంది. ఇది ఒక వలయాకార సూర్యగ్రహణం. దీనిని ఖగోళ భాషలో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని కూడా పిలుస్తారు. సూర్యుడి మధ్య భాగాన్ని చంద్రుడు కప్పి ఉంచినప్పుడు.. సూర్యుడు ఒక వెలుగుతున్న ఉంగరంలా కనిపిస్తాడు.
భారతదేశంలో కనిపిస్తుందా?
ఈ గ్రహణం భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల్లో కనిపించదు. ప్రధానంగా ఇది అంటార్కిటికా ఖండంలో స్పష్టంగా కనిపిస్తుంది.హిందూ మహాసముద్రంలోని కొన్ని భాగాలు, ఆఫ్రికాలోని దక్షిణాది దేశాలు మరియు ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. ఈ గ్రహణం మనదేశంలో కనిపించదు. అంటే దీని ప్రభావం మనదేశంపై ఉండదన్న మాట.
సూతక్ నియమాలు:
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, ఏ గ్రహణమైనా కంటికి కనిపిస్తేనే దానికి ‘సూతక్’ (అశుభ కాలం) నియమాలు వర్తిస్తాయి. భారత్‌లో గ్రహణం కనిపించదు కాబట్టి, ఇక్కడ సూతక్ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. దేవాలయాలు యధావిధిగా తెరిచే ఉంటాయి. శాస్త్రీయంగా ఇక్కడ గ్రహణం కనిపించదు కాబట్టి గర్భిణీలు భయపడాల్సిన పనిలేదు. అయితే, ఆధ్యాత్మిక నమ్మకాలు ఉన్నవారు ఆ సమయంలో దైవ ప్రార్థన చేసుకోవచ్చు. గ్రహణం కనిపించే దేశాల్లో ఉండేవారు మాత్రం నేరుగా సూర్యుడిని చూడకూడదు, కేవలం సోలార్ ఫిల్టర్లు ఉన్న అద్దాలను మాత్రమే వాడాలి.
Also Read: Sankranti 2026 -23 ఏళ్ల తర్వాత సంక్రాంతి రోజే ఏకాదశి.. పుణ్యఫలం కోసం ఏం చేయాలంటే?
జ్యోతిష్య కోణం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ గ్రహణం కుంభ రాశి మరియు శతభిషా నక్షత్రంలో సంభవిస్తుంది. గ్రహణం మన దేశంలో కనిపించకపోయినప్పటికీ, గ్రహ గతులలో వచ్చే మార్పుల వల్ల కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తుంటారు. 2026లో రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12న ఏర్పడబోతుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం.
Also Read: Holi 2026 – 2026లో హోలీ పండుగ ఎప్పుడంటే?

