ఆళ్లగడ్డ మండల పరిధిలోని హరి నగరం సమీపంలో ఈనెల 7వ తేదీ ఇస్కాన్ అహోబిలం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అహోబిలం ఇంచార్జ్ చంద్రకేశవ దాస్ తెలిపారు. స్థానిక ఇస్కాన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 7వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు దర్శన హారతి సాయంత్రం నాలుగు గంటలకు ఉట్లోత్సవం (అన్ని గ్రామాల నుండి యువకులు గ్రూపులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు) సాయంత్రం 6 గంటలకు హారతి భజన విందు భోజనము, 6,30 నిమిషాలకు ముఖ్య అతిధులచే శ్రీ కృష్ణాష్టమి సందేశం. 7 గంటలకు బహుమతుల ప్రధానం, రాత్రి 7 గంటలకు ఆంధ్ర గాన కోకిల ఏవి, సుబ్బారావు కుమారుడు ఏ, వెంకటేశ్వరరావు సమర్పించు శ్రీకృష్ణ రాయబారం నాటకం కలదు అన్నారు. రాత్రి 11 గంటలకు శ్రీ రాధా గోవిందులకు మహా శంకరాభిషేకం, 11:30 నిమిషాలకు మహా హారతి 108 రకాల మహా నివేదన, 12 గంటలకు జన్మాష్టమి మహా ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. 8 తేదీ ఉదయం 11 గంటలకు శ్రీ ల ప్రభు పాదా అభిషేకం, వ్యాస పూజ మరియు ప్రవచనం, మధ్యాహ్నం విందు భోజన వసతులు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఈకార్యక్రమంలో పాల్గొనే 10,000 మందికి భోజనం వసతి కల్పిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.