Thursday, March 27, 2025
HomeదైవంKasinayana : కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం: లోకేష్

Kasinayana : కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం: లోకేష్

అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం, నల్లమలలోని కాశీనాయన(Kasinayana) ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరమని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు.

అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సింది. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తానని చెప్పారు.

- Advertisement -

వైయస్ఆర్ కడప జిల్లా కాశినాయన మండలంలో వెలసిన శ్రీ అవధూత కాశినాయన( Kasinayana) ఆశ్రమం వద్ద ఉన్న వసతి భవనాలను ఫారెస్ట్ మరియు రెవెన్యూ అధికారులు తొలగించారు. గత కొన్ని సంవత్సరాలుగా టైగర్ జోన్ లో ఆశ్రమం మరియు ఆశ్రమ భవనాలు ఉన్నాయంటూ ఆశ్రమ నిర్వాహకులకు అధికారులు నోటీసులు అందించారు.

దీంతో ఈ నెల 7 భవనాలను కూల్చివేయొద్దు అంటూ స్వామీజీలు మరియు భక్తులు అడ్డుకున్నారు. భక్తుల ఆందోళన మధ్య కూల్చివేశారు. ధార్మిక సంస్థలకు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలని ఆందోళన చేస్తున్నారు.

తమలాంటి సాధువులు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్నామన్నారు. ఇప్పటికైనా జ్యోతి క్షేత్రాన్ని రక్షించి భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా కాపాడాలని వేడుకుంటున్నామని మీడియాతో తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News