Saturday, October 5, 2024
HomeదైవంJadcharla: అన్నపూర్ణ దేవిగా బంగారు మైసమ్మ దేవత

Jadcharla: అన్నపూర్ణ దేవిగా బంగారు మైసమ్మ దేవత

ఆకలి తీర్చే చల్లని తల్లిగా..

దసరా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి పక్కన, ఐబి బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత 3వ రోజు శనివారం శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

- Advertisement -

గణపతి పూజ అనంతరం శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు అభిషేకం, నవరాత్రోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు.

కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోనెల నరేందర్, ఘనాతే విజయ్ కుమార్, గుండు చంద్ర శేఖర్, భక్తులు కుచ్చరకంటి కిరణ్ కుమార్, సంతోషి కుమారి దంపతులు, జ్ఞాన ప్రసన్న, లక్ష్మి శ్రీ, మహేశ్వరి, సీత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News