Wednesday, October 2, 2024
HomeదైవంJadcharla: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

Jadcharla: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

గౌరమ్మ పూజ..

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగని కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు పేర్కొన్నారు. జడ్చర్ల మండలం కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు రంగురంగుల పువ్వులతో గౌరమ్మను తయారుచేసి బతుకమ్మ ఆడారు. వేడుకల అనంతరం బతుకమ్మను కోడుగల్ వాగులో వదిలారు.

- Advertisement -

ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి విశ్వవ్యాప్త ఖ్యాతిని అర్జించిన పండుగ బతుకమ్మ అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే జడ్చర్ల పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ పాఠశాలలో తీరక్క పూలతో చేసిన బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News