జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో శనివారం గంప జాతరను ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్మామి బ్రహ్మోత్సవాలు ముగిసిన రెండవ వారం గంప జాతర నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

గంపలో ఫోటో పెట్టుకుని పాదయాత్ర చేస్తూ
జాతరకు ఉమ్మడి జిల్లాలోని కొడంగల్, తాండూర్, కోస్గి, మద్దూర్, కోయిలకొండ, దేవరకద్ర గ్రామాలకు చెందిన భక్తులు గంపలో వారు పండించిన పంటలను, వారి ఇంటి దేవుడు అయిన శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి చిత్రపటాన్ని గంపలో పెట్టుకొని భక్తులు పాదయాత్ర చేసుకుంటూ గంప యాత్రగా వస్తారు. పాదయాత్రగా గంగాపూర్ చేరుకొని ఉపవాసంతో ఉండి స్వామివారికి నైవేద్యం చేసి ఆలయంలో చిరుధాన్యాలతో చేసిన వంటను దాసంగాలుగా పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.

దర్శనం తరువాత ఉపవాసం వదిలి
స్వామి దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలను తీసుకొని ఉపవాస దీక్షను వదులుతారు. గంప జాతర సందర్భంగా ఆలయ ఈవో దీప్తి రెడ్డి భక్తుల సౌకర్యార్థం వసతులు కల్పించారు. కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
