Tuesday, September 10, 2024
HomeదైవంJharasangam: దస్తగిరిలో ఘనంగా శని త్రయోదశి పూజలు

Jharasangam: దస్తగిరిలో ఘనంగా శని త్రయోదశి పూజలు

నేడు లక్ష బిల్వార్చన

జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాశీలుతున్న బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శనివారం శని త్రయోదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, శ్రీ సిద్దేశ్వరానందగిరి ఆధ్వర్యంలో ఆశ్రమ ఆవరణంలోని శనేశ్వర స్వామికి సుప్రభాత సేవ, అభిషేకం, తైలాభిషేకం తదితర కార్యక్రమాలను చేశారు.శని త్రయోదశి రోజున శనీశ్వరుడిని ఆరాధించడం, తైలాభిషేకం చేయడంతో మానవునికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయని సిద్దేశ్వర మహరాజ్ మాట్లాడుతూ అన్నారు.

- Advertisement -

స్వామివారి దర్శనం కోసం జహీరాబాద్, ఝరా సంగం, కర్ణాటకలోని బీదర్, సంగారెడ్డి, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. అలాగే ఆశ్రమంలో ఆదివారం జ్యోతిర్లింగాలకు లక్ష బిల్వార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News