July 2025 Astrology: ఆస్ట్రాలజీ దృష్ట్యా, బుధుడు, శుక్రుడు, గురు గ్రహాలను అత్యంత శుభ గ్రహాలుగా భావిస్తారు. మీ జాతకాల్లో ఈ మూడు గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉంటే చాలు మీకు దేనికీ లోటు ఉండదు. ప్రస్తుతం కర్కాటకంలో బుధుడు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు సంచరిస్తున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారు ఆగస్టు నెల చివరి వరకు కూడా మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఈ మూడు గ్రహాలు ఇలా మూడు రాశుల్లో సంచరించడం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంది. ఈ దృగ్విషియం వల్ల నాలుగు రాశులు వారు శుభకరమైన ఫలితాలను పొందబోతున్నారు.
కన్యా రాశి
మూడు శుభ గ్రహాలు సంచారం కన్యా రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఆదాయం వృద్ధి చెంది..మీరు ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉండగలగుతారు. మీరు వ్యక్తిగత, కుటుంబ సభ్యులు నుండి బయటపడతారు. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలకు కొదవుండదు. కెరీర్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి.. మంచి స్థాయికి వెళతారు. పెళ్లికాని ప్రసాదులకు వివాహ కుదిరే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
శుక్ర, గురు, బుధ గ్రహాల సంచారం వల్ల వీరు వృత్తి, ఉద్యోగాల్లో లాభపడతారు. వీరి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం లాభాలు బాట పడుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ, రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం తాండవిస్తోంది.
మేష రాశి
బుధ, గురు, శుక్ర గ్రహాల బలమైన స్థానం మేషరాశివారికి ధనధాన్యాలకు కొదవ లేకుండా చేస్తుంది. వీరికి అదృష్టం కలిసి వచ్చి ఆర్థికంగా ఎదుగుతారు. మీరు ఏ పని మెుదలుపెట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి. కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుతారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. మీరు అన్నీ సమస్యల నుండి బయటపడతారు.
వృషభరాశి
ఈ మూడు గ్రహాల సంచారం వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరు ఏ కార్యం తలపెట్టినా అది సకాలంలో పూర్తవుతుంది. సంపద బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రెట్టింపు లాభాలను చూస్తారు. ఉద్యోగులు జీతభత్యాలు రెట్టింపు అవుతాయి. ఆస్తులు భారీగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అనుకోకుండా గుడ్ న్యూస్ వింటారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.