Rahu Grah Favorite Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయాగ్రహం అని పిలుస్తారు. అంతేకాకుండా దీనికి దుష్ట, కీడు, పాపపు గ్రహం అనే పేర్లు కూడా ఉన్నాయి. రాహువు ఎప్పుడు వెనక్కు నడుస్తాడు. రాహువు మనుషులు జీవితాల్లో కల్లోలం సృష్టిస్తాడు. ఒక్కోసారి మంచి ఫలితాలను కూడా ఇస్తాడు. మీ జాతకంలో రాహు శుభ స్థానంలో ఉంటే మీకు తిరుగుండదు.
సాధారణంగా రాహువు వృషభరాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటే.. వృశ్చిక రాశిలో నీచ స్థితిని కలిగి ఉంటాడు. తమోగుణం కలిగిన రాహువు.. బుధుడు, శుక్రుడు, శనిదేవుడులను మిత్రులగా భావిస్తాడు. ఇతడికి సూర్యుడు, చంద్రుడు, కుజుడు శత్రువులు. రాహు అసత్యము, జూదము, కష్టము, వృద్ధాప్యము, విమర్శ, అంటరానితనం వంటి వాటికి కారకుడిగా భావిస్తారు. రాహువును శాంతింప చేయడానికి జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. అయితే రాహువు కూడా ఇష్టమైన రాశిచక్రాలు కూడా ఉన్నాయి. వీరిపై రాహు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహరాశి
రాహు గ్రహం సింహరాశి వారికి ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాడు. రాహ అనుగ్రహంతో వీరు ఎప్పుడూ చూడనంత డబ్బును చూస్తారు. మీకు అదృష్టం కలిసి వచ్చి ఎంతటి పనినైనా చిటికెలో పూర్తి చేస్తారు. అనుకోకుండా డబ్బు వచ్చి పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలను ముగిసి సఖ్యత పెరుగుతుంది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. మీకు ఆధ్యాత్మికత, మతపరమైన కార్యక్రమాల దృష్టి మరలుతుంది.
ఇవి కూడా చదవండి: Shani Vakri 2025: జూలై 13 నుంచి రివర్స్ లో నడవనున్న శని.. ఇక 3 రాశులు ధనవంతులవ్వడం పక్కా.. – Telugu Prabha Telugu Daily
వృశ్చిక రాశి
ఈ రాశివారిపై ఒక్కోసారి రాహు కన్నెరజేస్తాడు. అయితే కొన్నిసారు తన కోపాన్ని విడిచిపెట్టి శుభకరమైన ఫలితాలను ఇస్తాడు. వృశ్చిక రాశి వారి కెరీర్ లో అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతారు. మీరు సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ప్రయోజనాలు పొందుతారు. మీరు రుణ వముక్తి పొందుతారు. రాహు అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కడతేరుతాయి. మీ లవ్ సక్సెస్ అవుతుంది. దాంపత్య జీవితంలోని కలహాలన్నీ తొలగిపోతాయి.కుటుంబీకుల మధ్య గొడవ పోయి అందరూ సంతోషంగా ఉంటారు.
Desclaimer: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, హిందూ మత నమ్మకాల,ఇంటర్నెట్ సమాచారం వంటి వివిధ మాధ్యమాల నుండి సేకరించబడింది. తెలుగుప్రభ దీనిని ధృవీకరించడం లేదు.