HomeదైవంRajYogam: డిసెంబర్ 05న గజకేసరి యోగం.. అదృష్టమంటే వీరిదే!

RajYogam: డిసెంబర్ 05న గజకేసరి యోగం.. అదృష్టమంటే వీరిదే!

Gaja Kesari Yoga effect on Zodiacs: గ్రహాల కదలిక ప్రజలందరి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నవగ్రహాల్లో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. గురుడు ఏడాది తర్వాత తన రాశిచక్రాన్ని మారుస్తున్నాడు. ఇతడు డిసెంబర్ 05న మిథున రాశి ప్రవేశం చేయనున్నాడు. ఈ క్రమంలో చంద్రుడితో కలిసి శక్తివంతమైన గజకేసరి రాజయోగం సృష్టించబోతున్నాడు.

- Advertisement -

పంచాంగం ప్రకారం, బృహస్పతి డిసెంబర్ 05న మధ్యాహ్నం 3 38 గంటలకు మిథున రాశిలోకి తిరోగమన స్థితిలో ప్రవేశిస్తాడు. అదే రోజు రాత్రి 10 15 గంటలకు చంద్రుడు కూడా జెమినీలోకి వస్తాడు. ఒకే రాశిలో వీరిద్దరి కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ అరుదైన యోగం సుమారు 54 గంటల పాటు ఉండబోతుంది. కానీ ఇది ఇచ్చే ఫలాలు మాత్రం చాలా కాలంపాటు ఉంటాయి. ఈ శుభకరమైన యోగం వల్ల ఎవరు లాభపడనున్నారో తెలుసుకుందాం.

మిథున రాశి
న్యూ ఇయర్ కు ముందు గజకేసరి రాజయోగం మిథున రాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. లక్ ఎల్లప్పుడూ మీ వైపే ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి కార్యంలో విజయావకాశాలు మీకే ఎక్కువగా ఉంటాయి. మీ గోల్స్ ను మీరు సాధించే అవకాశం ఉంది. హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక సిద్దిస్తుంది. వివాహం కాని వ్యక్తులకు పెళ్లి సంబంధం కుదరవచ్చు. అంతేకాకుండా మీకు నచ్చిన వ్యక్తే జీవిత భాగస్వామిగా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతోపాటు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

మేష రాశి
గురుడు మరియు చంద్రుడు చేస్తున్న గజకేసరి యోగం మేషరాశి యెుక్క మూడో ఇంట్లో సంభవించబోతుంది. దీంతో ఈ రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఎప్పుడూ చూడని ప్రాఫిట్స్ చూస్తారు. ఉద్యోగావకాశాలు వస్తాయి. జాబ్ లో ప్రమోషన్ లభించడంతోపాటు శాలరీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. చాలా రోజులగా పెండింగ్ లో ఉన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తారు. మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలో విజయలక్ష్మీ మిమ్మల్నే వరిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. జీవితంలో సంతోషంతోపాటు ఐశ్వర్యం ఉంటుంది.

Also Read: Jupiter Transit – మిథునంలో గురుడి తిరోగమనం

కన్య రాశి
బృహస్పతి, చంద్రుల కలయిక ద్వారా ఏర్పడిన గజకేసరి రాజయోగం కన్యా రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ ఆదాయానికి సంబంధించి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వచ్చిన అవకాశాలను ఒడిసిపడతారు. మీ ఖర్చులు పెరిగినప్పటికీ అదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఏదైనా వ్యాపారం లేదా స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టాలంటే ఇదే మంచి టైం. ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు. కెరీర్ లో ఊహించని ఫలితాలను పొందుతారు. వైవాహిక, ఉద్యోగం జీవితం బాగుటుంది. పిల్లల కోసం ఎదురుచూసే వారు శుభవార్త వినే అవకాశం ఉంది.

Disclaimer: ఇక్కడ ఇచ్చిన సమాచారం మెుత్తం ఖచ్చితంగా నిజమని చెప్పలేం. పండితులు, నిపుణుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా దీనిని రూపొందించడమైనది. ఈ కథనానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News