Guru Shani Gochar effect on Zodiacs: గ్రహాలు, నక్షత్ర రాశుల ప్రభావం మానవ జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిచక్రాలను మారుస్తాయి. ఇటీవల దేవగురు వందేళ్లు తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో శని గ్రహం మీన రాశిలో సంచరిస్తున్నాడు. వీరిద్దరి గమనం కొన్ని రాశులవారికి అనుకూలంగా ఉండబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
దేవగురు ఇదే రాశిలో వందేళ్ల తర్వాత సంచరిస్తున్నాడు. దీని కారణంగా కర్కాటక రాశి వారు ఊహించని లాభాలు పొందుతారు. వ్యాపారం బాగా విస్తరిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇస్తాయి. కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. భారీగా డబ్బును పొదుపు చేస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు.
మిథున రాశి
గురుడు సంచారం మిథునరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. వీరు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ గౌరవ హోదాలు పెరుగుతాయి. కెరీర్ లో మంచి స్థాయికి వెళతారు. ఆఫీసులో మీ సహచరుల మద్దతు లభిస్తుంది. సంసార జీవితం సాఫీగా సాగుతోంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. విద్య లేదా ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: Nagula Chavithi 2025 -నేడే నాగుల చవితి.. పూజ ఎలా చేయాలో తెలుసా?
మకర రాశి
శని, బృహస్పతి సంచారం మకర రాశి వారికి సూపర్ గా ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది. కెరీర్ లో కీలక మలుపు ఉంటుంది. పిల్లలు లేని దంపతులకు సంతానం కలిగే అవకాశం ఉంది. మీరు రుణం నుండి విముక్తి పొందుతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. భార్యభర్తల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించిన గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది.
కన్యారాశి
కన్యారాశి వారికి శని సంచారం శుభప్రదంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ కోరికలు నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ లో ఊహించని గ్రోత్ ఉంటుంది. వివాహం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలమిస్తాయి. మీ ఖ్యాతి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.


