Jupiter Transit 2025 Effect On Zodiacs: అదృష్టానికి, ఐశ్వర్యానికి కారకుడైన బృహస్పతి ఇవాళ(జూలై 12) మిథునరాశిలో తిరోగమించనున్నాడు. దాదాపు 100 ఏళ్ల తర్వాత గురుడు ఈ స్థితిలోకి రాబోతున్నాడు. సాధారణంగా ఈ గ్రహమైన చెడు ఫలితాలను ఇస్తుంది, కానీ దేవగురు శుభఫలితాలను ఇవ్వబోతున్నాడు. బృహస్పతి యెుక్క ఈ కదలిక వల్ల ముగ్గురి జీవితాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ రాశుల వారికి వస్తు, కనక, ధనధాన్యాలకు లోటు ఉండదు. వీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇంతకీ ఆ లక్కీ రాశులు ఏవో తెలుసా?
మిథున రాశి
దేవ గురువు బృహస్పతి సంచారం మిథునరాశి వారికి ఎంతో శుభదాయకంగా ఉంటుంది. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. ఎంతోకాలంగా నిరుద్యోగులగా ఉన్నవారికి ఉద్యోగం వస్తుంది. నలుగురిలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది. వ్యాపారులు గతంలో చూడని లాభాలను ఇప్పుడు చూస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. దాంపత్య జీవితంలో వివాదాలు తొలగి మంచి లైఫ్ ను లీడ్ చేస్తారు. వీరు అధిక మెుత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తారు.
సింహరాశి
సింహరాశి వారిపై బృహస్పతి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సమయంలో వీరు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. అధిక మెుత్తంలో డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో ఎన్నడూ లేనంత సంతోషం ఉంటుంది. స్టాక్ మార్కెట్స్ లో డబ్బులు పెట్టేవారు లాభపడతారు. కెరీర్ పరంగా కూడా ఇది మంచి సమయం. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈరాశి వారు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. డబ్బును భారీగా పొదుపు చేస్తారు.
Also Read: Saturn transit 2025- మీనరాశిలో శని సంచారం
కన్యా రాశి
బృహస్పతి ప్రభావం కన్యా రాశి వారికి లాభదాయకంగా ఉండబోతుంది. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. భారీగా బంగారం, వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లైన జంటలకు సంతానప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. మీరు శక్తివంచన లేకుండా కృషి చేస్తే ఊహించని ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే సూపర్ గా ఉంటుంది. వైవాహిక జీవితం సుఖమయమవుతుంది. ఇతరులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి.


