Guru Gochar 2025 in August: వైదిక జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని శుభగ్రహంగా పరిగణిస్తారు. ఇతడిని జ్ఞానం, తెలివితేటలు మరియు సంతానానికి కారకుడిగా భావిస్తారు. ఆగస్టులో గురుడు రెండు సార్లు తన నక్షత్రాన్ని మార్చబోతున్నారు. ఆగస్టు 13న పునర్వసు నక్షత్రం మొదటి పాదంలోకి, మళ్ళీ ఆగస్టు 30న పునర్వసు రెండవ పాదంలోకి ప్రవేశించనున్నాడు. బృహస్పతి యెుక్క ఈ నక్షత్ర సంచారం కొన్ని రాశులవారిని అదృష్టవంతులను చేయనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మీన రాశి
ఈ రాశికి అధిపతిగా బృహస్పతిని భావిస్తారు. గురుడు సంచారం వల్ల మీనరాశి వారికి ఆగస్టులో మంచి రోజులు ప్రారంభకానున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానసుఖం కలుగుతుంది. ఇంట్లో శుభాకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మికతపై మక్కువ పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సక్సెస్ అవుతారు. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది.
కర్కాటక రాశి
గురుడు నక్షత్ర సంచారం కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. భారీగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వివాహా యోగం ఉంది. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని.. కెరీర్ లో ముందుకు వెళతారు. మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో శుభవార్త వింటారు. బైక్ లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మీకు భారీగా లాభాలను ఇస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కెరీర్ లో ఇంతకుముందు చూడని ఎదుగుదల ఉంటుంది.
మేష రాశి
ఆగస్టులో గురు సంచారం మేషరాశి వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు పదోన్నతికి అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు ఇంతకుముందు చూడని లాభాలను చూస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. మీకు అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉండబోతుంది. కెరీర్ లో ఊహించని ఎదుగుదల ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సలహాలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా దీనిని ఇచ్చాం. ఈ వార్తకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీన్ని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.
Also read: Pradosh Vrat 2025 – భౌమ ప్రదోష వ్రతం అంటే ఏమిటి? దీనిని ఎందుకు ఆచరించాలి?


