Jupiter Rise In Gemini 2025: నవగ్రహాల్లో పెద్దది బృహస్పతి. దీని గమనంలో ఏ చిన్న మార్పు వచ్చినా మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా బృహస్పతి విద్య, వివాహం, సంతానం, అదృష్టాన్ని ప్రభావితం చేస్తాడు. ఈ నెల రెండోవారంలో అంటే జూలై 09న గురుడు మిథునరాశిలో ఉదయించబోతున్నాడు, ఆస్ట్రాలజీలో గ్రహాల ఉదయం శుభప్రదంంగా భావిస్తారు. అదే విధంగా బృహస్పతి ఉదయించడంతో కొన్ని రాశులవారి సుడి తిరగబోతుంది. వీరికి జూలై మెుత్తం తిరుగుండదు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహరాశి
బృహస్పతి ఆశీస్సులు సింహరాశికి ఎల్లప్పుడూ ఉంటాయి. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. విద్యార్థులు చదువులో రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారు. ప్రేమికుల మధ్య ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు ఆర్థికంగా ఊహించని లాభాలను పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుంది. అప్పుల భారం నుండి విముక్తి పొందుతారు. మీరు కెరీర్ లో మంచి స్థాయికి ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి.
వృశ్చిక రాశి
గురుడు ఉదయించడం వల్ల వృశ్చిక రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. వీరు కుటుంబ సభ్యుల అండతో ఎంతటి కార్యనైనా నెరవేరుస్తారు. అనుకోకుండా శుభవార్తను కూడా వినే అవకాశం ఉంది. పాలిటిక్స్ లో రాణిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. స్పోర్ట్స్ ఆడేవారికి ఈ సమయం అద్భుతంగా ఉండబోతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపరీక్షలు రాసే అభ్యర్థులు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ మీకు ఉంటాయి.
మేష రాశి
మిథున రాశిలో బృహస్పతి ఉదయించడం మేషరాశి వారికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. మీకు కొత్త ఆదాయ వనరులు కలుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు భారీగా లాభాలను ఇస్తాయి. దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. అవివాహితులకు పెళ్లి కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనులు కంప్లీట్ అవుతాయి. మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ప్రయోజనం పొందుతారు.
వృషభరాశి
వృషభరాశి వారికి బృహస్పతి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశికి అధిపతిగా గురు గ్రహాన్ని భావిస్తారు. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ అనారోగ్యం నుంచి కోలుకుంటారు. మీ వైవాహిక జీవితంలోని ఇబ్బందులను అధిగమిస్తారు.. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లభిస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. తోబట్టువుల సపోర్టు లభిస్తుంది.