తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటా నగరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం వైభవంగా సాగింది. జార్జియాలో స్థానికంగా ఉంటున్న పలు తెలుగు కుటుంబాలవారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కెనడా, USA లలో జూన్, జూలై నెలల్లో 14 నగరాల్లో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవాలు టీటీడీ నిర్వహిస్తోంది. APNRTS సౌజన్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రాష్ట్ర, దేశ, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణములు టీటీడీ నిర్వహిస్తోంది.
కెనడా, USA లలోని పలు తెలుగు అసోసియేషన్లు, ధార్మిక,సేవా సంస్థల కోరిక మేరకు ఆయా దేశాలలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కళ్యాణాలు తరచూ నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. టీటీడీ నియమాల ప్రకారం శ్రీవారి కళ్యాణం నిర్వహిస్తూ, శ్రీవారి లడ్డూను కూడా భక్తులకు పంచుతున్నారు. తిరుమల శ్రీవారి దేవస్థానం నుండి వెళ్ళే అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమం మొదలై.. తిరుమలలో లాగానే శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉన్నట్టు ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు.
Dallas, TX, USA – 2nd July, 2023
St. Louis, MO, USA – 6th July, 2023
Philadelphia, PA, USA – 9th July, 2023
Morganville, NJ, USA – 15th July, 2023
Houston, TX, USA – 16th July, 2023
Irving, TX, USA – 21st – 23rd July, 2023 (Srivari Kalyanam & Brahmotsavams)