Friday, November 22, 2024
HomeదైవంKarthika Paurnami: పరమ పవిత్రం కార్తీక పౌర్ణమి

Karthika Paurnami: పరమ పవిత్రం కార్తీక పౌర్ణమి

ఉత్తరాదిన దేవ్ దీపావళి జరుపుకుంటారు

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది ఇది అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్ర మైనదే.. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదాని కంటే మరొకటి అధిక ప్రభావంతమైనవి. నెలరోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ ఒక ఎత్తు. అందువల్ల అనేక ప్రతాలు పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. పౌర్ణమిరోజున దీపారా ధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాల్లో రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీదా, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధి లోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలపై బియ్యప్పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అలంకరించుకొని వెలిగించాలి. శివాల యంలో ధ్వజస్తంభంపై నందాదీపంతో పేరుతో అఖండదీ పాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరిణల్లో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి, వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులు, నదులు వంటి జల వనరుల్లో విడిచి పెడతారు. ఇలా చేయడం వల్ల అప్లైశ్వర్యాలు కలగడంతో పాటు ఎంతో పుణ్యం వస్తుంది. వైజ్ఞానిక పరంగా ఆలోచిస్తే ఈ కార్తీక దీపాల వెలుగుల నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలోని కాలుష్యం తగ్గిపోయి వాతావరణం శుద్ధి అవుతుంది. ఫలితంగా ఆరోగ్యం చేకూరుతుంది. కార్తీక పౌర్ణమి నుంచి ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగి స్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం అని దీనికి పేరు, ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్ధం శివుని ఆరా ధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల వరం ఇవ్వదలచు కోలేదట శివుడు. అందుకే “అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా పూర్ణాయుష్కరాలు, విధవ అయిన కుమార్తె కావాలా?” అని అడిగితే.. కుమారుణ్ణే కోరుకున్నారా దంపతులు. శివుడి వరం తోటి ఆ దంపతులకి కుమారుడు పుట్టాడు. అయితే ఆ కుమారుడు పెరుగుతున్న కొలదీ ఆ తల్లిదండ్రుల్లో గుబులు పెరుగు తోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికే టంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశాడు వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి అసలు విషయం తెలిసింది ఆ సాధ్వికి, తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుడ్ని ప్రార్ధించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం .

- Advertisement -

ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరోపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు నగరాలను వరంగా పొందారు. అలాగే ఎవరివల్లా మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంపై, విల్లు కాని విల్లుతో, .. నారికాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరే ఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురునీ ఏక కాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు, ఆ వర బలంతో లోకాలన్నింటా కల్లోలం సృష్టించారు. వివిధ లోకవాసులు విసిగిపోయి బ్రహ్మకు మొర పెట్టు కున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేను.. మీరు విష్ణువు దగ్గరకు వెళ్ళండి అని చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తి లేదని, వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు, దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లె తాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడని, అందువల్ల కార్తీక పౌర్ణమికి ఈ పేరు వచ్చిందని పురాణ కథనం..

కార్తీక పౌర్ణమిరోజు చేసే స్నానం, దీపా రాధన, ఉపవాసం వంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ప్రస్తుతకాలంలో ఉద్యోగాల బిలో కానీ ఇతర ఏ కారణం చేతనైనా రోజూ దేవుడ్ని పూజించి దీపారాధన చేసే సమయం లేనివారు, నిష్టను ఆచరించలేని వారు కార్తీక పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు.. నెలంతా పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఈ రోజున స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల కడుపు చలువ అంటే బిడ్డలకు రక్ష కలుగుతుందని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. ఈ రోజు మరో ప్రత్యేకత ఏంటంటే.. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం. కార్తీక పౌర్ణమిరోజు శివుడు త్రిపురాసురులను సంహరించి ఇంటికి వస్తాడు. విజయంతో తిరిగి వచ్చిన పరమశివుడికి దిష్టి తగలకుండా ఉండటం కోసం పార్వతీదేవి జ్వాలాతోరణోత్సవం నిర్వహించిందట. అదే పద్ధతిలో ఈ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణోత్సవాన్ని జరుపుతుంటారు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి ఈ జ్వాలా తోరణోత్సవాన్ని చూడటం వల్ల సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయట. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు, వాటిలో వృష ప్రతం, మహీఫల వ్రతం, నానాఫల ప్రతం, సౌభాగ్య ప్రతం మనోరథ పూర్ణిమామ్రతం, కృత్తికామ్రతం వంటివి ముఖ్యమైనవి. వీటితో పాటు లక్ష బిల్వార్చన, లక్ష ప్రదక్షిణ, లక్ష వత్తులు, లక్ష రుద్రం వంటి పూజలు చేస్తారు.

ప్రత్యేకతలు

దైవదర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని కార్తీక పురాణంలో ఉంది. ఎవరి శక్తి సామర్థ్యంలను బట్టి హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందాలి. వీరిని ఎంత నిష్టతో పూజిస్తే అంత శుభఫలితాలు ఉంటాయి.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News