Saturday, November 15, 2025
HomeదైవంKarthika Pournami 2025: కార్తీక పౌర్ణమి నాడు ఈ ఒక్క చిన్న పని చేశారంటే..మీ ఇంట...

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి నాడు ఈ ఒక్క చిన్న పని చేశారంటే..మీ ఇంట కాసుల పంటే!

Karthika Pournami 2025- Kartika Deepam:కార్తీక పౌర్ణమి రోజుని భక్తులందరూ ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీ బుధవారం వచ్చింది. ఈ రోజు ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, జ్యోతిష్యపరంగా కూడా చాలా శక్తివంతమైనదిగా పండితులు వివరిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ రోజున దేశవ్యాప్తంగా దేవాలయాలు దీపాల కాంతులతో వెలుగుతుంటాయి. భక్తులు దీపాలు వెలిగించి తమ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తారు.

- Advertisement -

కార్తీక పౌర్ణమి అంటే చంద్రుడు సంపూర్ణ కాంతితో కనిపించే రోజు ఇది. ఈ దినం దేవతలకు ఎంతో ప్రీతికరమైనదని పురాణాల్లో పండితులు పేర్కొన్నారు. హిందూ సంప్రదాయంలో ఈ రోజున శివుడి, శ్రీహరియైన విష్ణువుని, అలాగే మహాలక్ష్మీ దేవిని పూజించడం అత్యంత మంగళకరమని నమ్మకం ఉంది. భక్తులు ఈ మూడు దైవాలను ఒకే రోజు ఆరాధించడం వలన పుణ్యఫలాలు అనేక రెట్లు పెరుగుతాయని పండితులు వివరించారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/five-zodiac-signs-to-get-luck-from-sun-transit-2026/

కార్తీక పౌర్ణమి విశేషం ఏంటంటే…

ఈసారి కార్తీక పౌర్ణమి విశేషం ఏంటంటే, ఈ రోజున మూడు శుభ యోగాలు కలిసివస్తున్నాయి. అవి సర్వసిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, అశ్విని నక్షత్రం. ఈ మూడు కలయిక చాలా అరుదుగా జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక యోగాలు ఒకే రోజున ఏర్పడడం వలన చేసిన పూజలు, హోమాలు, వ్రతాలు అత్యంత ఫలప్రదంగా ఉండనున్నాయని పండితులు చెబుతున్నారు.

దేవతలు గంగానదిలో…

హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున దేవతలు గంగానదిలో స్నానం చేయడానికి భూమిపైకి వస్తారని నమ్మకం ఉంది. అందుకే ఆ రోజు గంగాస్నానం లేదా పవిత్ర నదుల్లో స్నానం చేయడం అత్యంత పుణ్యకరమని చెబుతారు. ఎవరికీ ఆ అవకాశం లభించకపోతే ఇంట్లోనే స్నానం చేసి దేవతలను ప్రార్థించాలి.

దీపదానం చేయడం..

కార్తీక మాసంలో దీపదానం చేయడం ఎంతో ముఖ్యమైన ఆచారం. ఈ రోజున ఉసిరి చెట్టు కింద లేదా ఇంటి ముందు దీపం వెలిగించడం ద్వారా మనసులోని కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది. ముఖ్యంగా ఉసిరి దీపం వెలిగించిన వారికి ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సుఖం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. దీపాన్ని వెలిగించే సమయంలో “ఓం నమశ్శివాయ” లేదా “ఓం నమో నారాయణాయ” మంత్రాలను జపించడం శుభకరమని పేర్కొంటారు.

కార్తీక పౌర్ణమి రోజున శివాలయ సందర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తెల్లవారుజామున లేచి పవిత్ర స్నానం చేసి, శివలింగానికి నీరు, పాలు, తేనెతో అభిషేకం చేస్తే మనసులో ఉన్న కోరికలు సఫలమవుతాయని విశ్వాసం. చాలా మంది భక్తులు ఈ రోజు రాత్రి దీపారాధన చేసి “శివ కాశీ దీపం” వెలిగిస్తారు. ఇది సర్వ పాపాలను పోగొట్టి, జీవితంలో శాంతి, ఆనందం తీసుకువస్తుందని భావిస్తారు.

ఆర్థిక సమస్యలు..

ఇక లక్ష్మీదేవిని ఈ రోజున పూజించడం ద్వారా ఇంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. భక్తులు శుభ్రంగా ఇల్లు అలంకరించి, దీపాలు వెలిగించి, నైవేద్యం సమర్పించి, లక్ష్మీదేవి కీర్తనలు పాడుతారు. పండితుల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పూజకు శ్రీహరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ రెండు దైవ శక్తులు కలిసిన రోజు కావడంతో, ఇంటి సౌభాగ్యం రెట్టింపు అవుతుందని చెబుతున్నారు.

జ్యోతిష్య దృష్టిలోనూ ఈ రోజు అతి మంగళకరం. చంద్రుడు సంపూర్ణ కాంతితో ప్రకాశించే సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని విశ్వాసం. పండితులు ఈ రోజు ధ్యానం చేయడం, శ్లోకాలు చదవడం, భజనలు పాడడం ద్వారా మనసు, శరీరానికి శాంతి కలుగుతుందని సూచిస్తున్నారు.

పేదవారికి ఆహారం, బట్టలు..

కార్తీక పౌర్ణమి రోజున దానం చేయడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం. పేదవారికి ఆహారం, బట్టలు, దీపాలు లేదా దినసరి వస్తువులు ఇవ్వడం ద్వారా అపారమైన పుణ్యం పొందవచ్చని ధార్మిక గ్రంథాలు పేర్కొంటాయి. ప్రత్యేకంగా ఈ రోజు సాయంత్రం సమయంలో గంగాదేవికి దీపం సమర్పించడం అత్యంత పవిత్రమని భావిస్తారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/is-finding-money-on-the-road-lucky-or-unlucky/

ఈ రోజున ఎవరికైనా శుభకార్యాలు ప్రారంభించడం, కొత్త వ్యాపారం మొదలుపెట్టడం లేదా గృహప్రవేశం వంటి కార్యక్రమాలు చేయడం అనుకూలమని జ్యోతిష్యులు చెబుతున్నారు. సర్వసిద్ధి యోగం ఉండడం వలన ఏ పని చేసినా మంచి ఫలితం లభించే అవకాశముంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad