Karthika pournami gajakesari yoga lucky zodiac signs benefits: కార్తీక పౌర్ణమిని రేపు (నవంబర్ 5)న భక్తులు జరుపుకోనున్నారు. చంద్రుడు, గురువు ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి ఈ కార్తీక పౌర్ణమి నుంచి గజకేసరి యోగం పట్టనుంది. ఆ జాబితాలో .. మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులకు శుభ దశ, ధన యోగం కలగనుంది. దీంతో ఈ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా, ఈ కార్తీక పౌర్ణమి వేళ.. శివార్చనతో మరింత శుభ యోగం వీరికి కలగనుందని పండితులు చెబుతున్నారు. అయితే, ఆ రాశులేవో చూద్దాం.
మేష రాశి
కార్తీక పౌర్ణమి ఈ మేష రాశిలో ఏర్పడనుంది. అలాగే కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో గురువు ఉండటంతో వీరికి ఇకపై గజకేసరి యోగం పట్టనుంది. ఈ రాశి వారికి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మనస్సులో ఉన్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. రాజ, ధన యోగం కలుగుతుంది. అలాగే మానసికంగా కూడా సమస్యల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి
ఈ రాశి వారికి కార్తీక పౌర్ణమి నుంచి అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగం, డబ్బు ఇలా అన్నింట్లో ఉన్న సమస్యలు తీరిపోతాయి. అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి. ఆర్థికంగా అన్ని సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు.
కర్కాటక రాశి
గణపతి, శివుడిని ఈ రాశి వారు పూజించడం వల్ల ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఏ వ్యాపారం చేపట్టినా మంచి లాభాలు వస్తాయి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరిపోతాయని పండితులు చెబుతున్నారు.
తులా రాశి
వీరికి సప్తమ స్థానంలో చంద్రుడి బలం పెరగడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీంతో అదృష్ట యోగం పట్టే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎలాంటి సమస్యలు రావని పండితులు చెబుతున్నారు.
మకర రాశి
ఉచ్చ స్థానంలో గురువు కారణంగా ఈ రాశి వారికి గజకేసరి యోగం ఏర్పడనుంది. దీనివల్ల వీరికి అన్ని విధాలుగా మంచి జరగనుంది. ముఖ్యంగా శివార్చన ఈ రాశి వారు చేస్తే సంతానం కలిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
మీనరాశి
వీరికి రాశ్యధిపతి గురువుతో గజకేసరి యోగం ఏర్పడనుంది. దీనివల్ల వీరికి అపర కుబేర యోగం కలుగుతుంది. అయితే, వీరు సుబ్రహ్మణ్య అష్టకం పటించడం లేదా పూజ చేయడం వల్ల వీరికి అన్ని విధాలుగా మంచి జరగనుందని పండితులు చెబుతున్నారు.


