Karwa Chauth 2025 Do’s and Don’ts: హిందువులు జరుపుకునే ముఖ్య పండుగల్లో కర్వా చౌత్ ఒకటి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్థి తిథి నాడు కర్వా చౌత్ పండుగను జరుపుకుంటారు. ఈ వేడుకను ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. పెళ్లైన స్త్రీలు ఈరోజున భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటూ కర్వా మాతను పూజిస్తారు. మంచి భర్త దొరకాలని పెళ్లికాని అమ్మాయిలు కూడా ఈ ఉపవాసాన్ని పాటిస్తారు. ఈరోజున మహిళలు సాయంకాలం చంద్రుని దర్శనం తర్వాత భర్త మెుహాన్ని జల్లెడలో చూసి.. అతని చేతుల మీదుగా స్త్రీలు ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ సంవత్సరం ఈ పండుకు ఎప్పుడు వస్తుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.
కర్వా చౌత్ ఎప్పుడు?
ఈ సంవత్సరం కర్వా చౌత్ పండుగను అక్టోబర్ 10న జరుపుకోనున్నారు. కార్తీక మాసం కృష్ణ పక్ష చతుర్థి తిథి అక్టోబర్ 10 రాత్రి 10:54 గంటలకు ప్రారంభమై.. అదే రోజు సాయంత్రం 07:38 గంటలకు ముగుస్తుంది. ఉదయం 05:16 నుండి సాయంత్రం 06:29 వరకు పూజించడానికి మంచి సమయం. చంద్రోదయ సాయంత్రం 07:42 గంటలకు అవుతుంది. పురాణాల ప్రకారం, సావిత్రి తన భర్త యొక్క ఆత్మ కోసం మృత్యు దేవుడైన యముడిని ఈ ఉపవాస దీక్షతో వేడుకుంటుంది.
ఏం చేయాలి, ఏం చేయకూడదు?
సర్గి తినకుండా ఉపవాసం ప్రారంభించవద్దు. ఇందులో పండ్లు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉంటాయి. ఈరోజున నలుపు మరియు తెలుపు రంగు దుస్తులు ధరించడం అశుభంగా భావిస్తారు. అందుకే మీరు ఎరుపు, గులాబీ మరియు పసుపు వంటి రంగుల గల దుస్తులను ధరించండి. పదునైన వస్తువులు అంటే కత్తెర, సూదులు లేదా కత్తులు వంటివి ఉపయోగించడం మానుకోండి. ఈ వస్తువులను ఉపయోగించడం వల్ల వ్రతం యొక్క ప్రయోజనాలు తగ్గుతాయని నమ్ముతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం, పాలు, పెరుగు లేదా తెల్లని రంగులో ఉన్నవి దానం చేయకండి. ఈరోజున పెర్ఫ్యూమ్స్, కుంకుమ పువ్వు మరియు ఎరుపు చునారి వంటివి డోనేట్ చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో సంతోషంతోపాటు శాంతి కూడా ఉంటుంది.


