కొలిచేవారికి ఆరాధ దైవం జగద్గురు ఖాదర్ లింగ స్వామి, మత సామ్రాస్యానికి ప్రత్యేకంగా మహిమ గల ఆరాధ్య దైవం ఉరుసు ప్రారంభమై జూన్ 4వ తారీకు వరకు ఐదు రోజులపాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు దర్గా పెద్ద సయ్యద్ షా మున్నా సాహెబ్ తెలిపారు. భక్తులు ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే స్వామివారిగా పేరుగాంచిన కౌతాళం ఖాదర్ లింగ స్వామి 319వ ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి స్వామిని కులమతాలకు అతీతంగా కొలుస్తారు. జూన్ 1న గంధం 2న ఉరుసు, 3న సఫార, 4న జియారత్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈయన ఈశ్వర్ అల్లా ఒకటే అని చాటడంతో పాటు స్వయంగా ఆచరించారు. లింగాయాతుల ఆరాధ్య దైవం శివలింగం ధరించి ఆదర్శంగా నిలిచారు. స్వామి స్వర్గస్తులై దాదాపు 300 ఏళ్ల దాటడంతో పరిసర ప్రాంతాల్లో ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.