భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి వస్తువు, ప్రతి దిశ, ప్రతి అలవాటు ఒక పరమార్థంతో కూడి ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. మన జీవన శైలిలో సానుకూల మార్పులు రావాలంటే, వాస్తు నియమాలను పాటించడం ద్వారా శ్రేయస్సు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. అలాంటిది మనం రోజూ ఉపయోగించే వస్తువుల్లో ముఖ్యమైనదే పర్స్. దీనిలో డబ్బులు, కార్డులు, పేపర్స్ పెట్టుకుంటాం. కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈ పర్స్ మనకు ఆర్థికంగా సానుకూలతను ఇచ్చే శక్తివంతమైన సాధనంగా మారుతుంది.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, అప్పుల భారం నుంచి బయటపడాలనుకునేవారు తమ పర్సులో రెండు నల్ల మిరియాలను ఉంచితే అనుకూల ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది శని గ్రహ దోషాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఇక పర్స్ అనేది మన సంపద నిల్వ చేసుకునే చోటు. అందుకే అక్కడ ఉండే వస్తువులపై శుభాశుభ ఫలితాలు ఆధారపడి ఉంటాయని పండితులు అంటున్నారు. పర్సులో ఉంచకూడని కొన్ని వస్తువులు కూడా ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్స్పైరీ డేట్ ముగిసిన పేపర్లు, పాత ఏటీఎం రిసీట్లు, ఉపయోగం లేని చిల్లర నాణేలు నెగెటివ్ ఎనర్జీని పెంచే అవకాశం ఉందని జ్యోతిష్కులు అంటున్నారు. ఇవి ఆర్థిక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేగాక.. పర్సులో మిరియాలు ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ పెరిగి, ధన ప్రవాహం మెరుగవుతుందని వారు పేర్కొంటున్నారు.
ఈ చిట్కాను పాటించేవారు కొత్త ఆలోచనలకు ఓపెన్‌గా మారి, అవకాశాలను గ్రహించగలగుతారని అంటున్నారు.. (గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, పండితులు చెప్పిన వివరాల ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)