Ketu And Venus Conjunction 2025 Effect: ప్రతి నెలా ఏవో కొన్ని గ్రహాలు రాశులను మారుస్తాయి. శుభగ్రహమైన శుక్రుడు సెప్టెంబరు 15న సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే ఇదే రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. వీరిద్దరి సంయోగం అక్టోబరు 08 వరకు ఉండనుంది. కేతు, శుక్ర గ్రహాల సంయోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
ధనస్సు రాశి
శుక్ర కేతువు సంచారం వల్ల ధనస్సు రాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సక్సెస్ అవుతారు. మీ ఆదాయం భారీగా పెరగనుంది. కెరీర్ లో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు. అదృష్టంతోపాటు ఐశ్వర్యం ఉంటుంది. ఉద్యోగులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. మీ వ్యక్తిత్వం నలుగురిని ఆకట్టుకుంటుంది. అప్పుల ఊబి నుండి బయటపడతారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.
కర్కాటక రాశి
శుక్రుడు-కేతు గ్రహాల కలయిక కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. ఈరాశి వారు కెరీర్ లో ఊహించని మలుపు ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. బిజినెస్ లో ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. ధనప్రాప్తి కలుగుతుంది. మీ అన్నీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ గోల్ ను సాధించడంలో సఫలీకృతం అవుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శుక్ర-కేతు గ్రహాల సంయోగం కలిసి రాబోతుంది. మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీ కెరీర్ లో ఊహించని స్థాయికి వెళ్లారు. సమాజంలో గౌరవంతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు ప్రమోషన్ లభిస్తుంది. మీరు చేపట్టిన అన్ని పనుల్లో అదృష్టం ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందడంతోపాటు భారీ స్థాయిలో లాభాలు కూడా ఉంటాయి. కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితులు సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా పై కథనాన్ని రూపొందించడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


