Ketu Favourite Zodiacs: జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతులను కీడు గ్రహాలు అనీ, దుష్ట గ్రహాలనీ అంటారు. అయితే వీటి ప్రభావం మనిషి జీవితం కష్టాలమయం అవుతుందని చెబుతారు. అయితే కొన్నిసార్లు ఇవి శుభ ఫలితాలను కూడా ఇస్తాయి. మీ జాతకంలో కేతు శుభ స్థానంలో మంచి ఫలితాలు, అశుభ స్థానంలో ఉంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి. అయితే కేతు గ్రహానికి కొన్ని ఇష్టమైన రాశులు ఉన్నాయి. అతడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ రాశులకు ఉంటాయి. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
కన్యా రాశి
కేతువు అనుగ్రహం కన్యారాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. వీరి ఆదాయం అమాంతం పెరుగుతుంది. కెరీర్ లో ఉన్న అడ్డంకులు తొలగిపోయి.. మంచి స్థాయికి చేరుకుంటారు. మీ సంపద వృద్ధి చెందుతుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి.
తుల రాశి
కేతువు కృప కటాక్షాల కారణంగా తులా రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు కోలుకుంటారు. నలుగురిలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఎవ్వరూ ఊహించనంత డబ్బును సంపాదిస్తారు. కెరీర్ లో సానుకూల మార్పులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా లాభాలు ఉంటాయి. వీరికి అదృష్టంతోపాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది.
మేష రాశి
కేతు కటాక్షం మేషరాశి వారికి పుష్కలంగా ఉంటుంది. వీరు ఏ కార్యం చేపట్టినా అందులో విజయం వరిస్తుంది. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ఆస్తుపాస్తులకు లోటు ఉండదు. భారీగా డబ్బును పొదుపు చేస్తారు. బంగారం, కార్లు వంటి లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీరికి లక్ కూడా కలిసి వస్తుంది.
Also Read: Shukra Gochar 2025- సొంతరాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కేతు ఆశీస్సులు ఉంటాయి. దీంతో వీరు ముట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారులు ఎన్నడూ చూడని ప్రాఫిట్స్ చూస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు బాగా లాభపడతారు. ఆకస్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమయ్యే అభ్యర్థులు సక్సెస్ అవుతారు.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను ఇవ్వడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.
Also Read: Aja Ekadashi 2025 – అజ ఏకాదశి ఆగస్టు 18నా లేదా 19నా? ఖచ్చితమైన తేదీ తెలుసుకోండి..


