ketu transit into purva falguni nakastra: ఆస్ట్రాలజీలో కేతువును కీడు గ్రహంగా భావిస్తారు. అలాంటి కేతువు జూలై 06న పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించబోతుంది. కేతువు యెుక్క ఈ నక్షత్ర సంచారం మూడు రాశులవారికి విజయాన్ని చేకూర్చనుంది. అంతేకాకుండా వీరికి ధనధాన్యాలకు లోటు ఉండదు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. కెరీర్ లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఇంతకీ ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.
తులారాశి
కేతువు నక్షత్ర మార్పు తులా రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కుదుటుపడుతుంది. దైనందిన జీవితంలో మార్పులు వస్తాయి. మంచి డైట్ ఫాలోయితే మీకే మంచిది. సంపాదన పెరుగుతుంది. మీ ప్రేమకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. బంధువులు మధ్య మనస్పర్థలు తొలగిపోయి అపాయ్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది.
వృషభ రాశి
కేతువు నక్షత్ర సంచారం వృషభరాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వస్తాయి. అనుకున్న పని సమయానికి కంప్లీట్ అవుతుంది. మీ ఆదాయం అధికమవుతుంది. జాబ్ కొట్టాలన్న మీ కోరిక నెరవేరుతోంది. ఆర్థికంగా మునుపటి కంటే మంచి స్థితిలో ఉంటారు. విదేశీ కంపెనీలో కాంట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. మీకు అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి.. అనుకున్న స్థానానికి చేరుతారు.
కుంభరాశి
కుంభరాశి వారికి కేతువు యెుక్క నక్షత్ర మార్పు లాభిస్తుంది. ఊహించని ధనలాభం ఉంటుంది. సోసైటీలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అనుకున్న కార్యం నెరవేరుతోంది. కెరీర్ లో ఎన్నో విజయాలు సాధిస్తారు. పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ముగిసి సత్సంబంధాలు పెరుగుతాయి. బిజినెస్ లో మునుపెన్నడూ చూడని లాభాలను చూస్తారు. ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికి శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.