Grah Gochar 2025 in October: ఉత్తర భారతదేశ ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో కర్వా చౌత్ ఒకటి. ముఖ్యంగా ఈ వేడుకను వివాహిత స్త్రీలు తమ భర్తలు దీర్ఘాయుష్షు కోసం కర్వా మాత(పార్వతీ దేవి)ను పూజిస్తారు. పెళ్లికాని స్త్రీలు మంచి భర్త దొరకాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ సారి ఈ పండుగ అక్టోబరు 10న జరుపుకోనున్నారు. ఈ పండుగ రోజే సూర్యచంద్రుల సంచారం జరగబోతుంది. ఇదో రోజు చంద్రుడు వృషభ రాశిలోకి, సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. పైగా గ్రహాల రాజు చిత్త నక్షత్రంలోకి వెళ్తాడు. సూర్యుడు శక్తికి, చంద్రుడిని శాంతికి ప్రతీకగా భావిస్తారు. అయితే కర్వా చౌత్ నాడు ఈ గ్రహా సంచారాల వల్ల మూడు రాశులవారి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి.
కర్కాటక రాశి
కర్వా చౌత్ నాడు కర్కాటక రాశి వారి తలరాత మారబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. పని చేసే చోట ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. బంగారు కొనడానికి ఇదే మంచి సమయం. నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటారు. సంసార జీవితం బాగుంటుంది.
Also Read: Papankusha Ekadashi -2025లో పాపాంకుశ ఏకాదశి ఎప్పుడు? తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి..
తులారాశి
సూర్యచంద్రుల స్థానం మార్పు తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారం ప్రారంభించాలన్న, పెట్టుబడి పెట్టాలన్న ఇదే మంచి టైం. నిరుద్యోగులకు మంచి రోజులు రాబోతున్నాయి. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చెంతకు చేరుతుంది. కెరీర్ లో ఊహించని ఎత్తుకు ఎదుగుతారు. ఆఫీసులో మీ బాస్ చేత ప్రశంసలు అందుకుంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది.
వృషభ రాశి
సూర్యచంద్రుల సంచారం కారణంగా వృషభరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మీ కృషికి తగిన ప్రతిఫలాలు లభిస్తాయి. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. కెరీర్ లో ఊహించని పెరుగుదల ఉంటుంది. అప్పుల భారం నుండి విముక్తి లభిస్తుంది.


