Friday, January 31, 2025
HomeదైవంVastu : ఇంట్లో కిచెన్ ఈ దిశలో ఉంటే.. లక్ష్మీ కటాక్షం..!

Vastu : ఇంట్లో కిచెన్ ఈ దిశలో ఉంటే.. లక్ష్మీ కటాక్షం..!

సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. అమ్మవారి కరుణ లేకపోతే ఎన్ని తెలివితేటలున్నా, ఎంత పేరు ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఇబ్బందులు పడాల్సిందే. ఈ క్రమంలోనే చాలా మంది లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో పనులు చేస్తుంటారు. అయితే ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి పెద్దలు చెబుతూంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే వంట గదిలో లక్ష్మీ దేవితో పాటు అన్నపూర్ణ మాత కూడా ఉంటుంది. ఆ ఆది శివుడికే అన్నం పెట్టిన లోక మాత.. అన్నపూర్ణా దేవి. కాబట్టి అన్నానికి ఎప్పుడూ వాల్యూ ఇవ్వండి. ఈ విషయం అటుంచితే.. సాధారణ గదుల లాగా కాకుండా.. వంట గదిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

- Advertisement -

చాలా మంది లేడీస్ వంట గదిలో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. వంట గది నీట్‌గా, క్లీన్ ఉండేలా చూసుకుంటారు. ఇందుకు తగ్గట్టుగానే మంచి కలర్‌ఫుల్ పెయింటింగ్స్ కూడా వేయిస్తారు. అయితే వంట గదిలో అన్నీ వాస్తు ప్రకారం ఉండాలంటున్నారు పండితులు. ముఖ్యంగా ఈశాన్య దిశలో వంటగదిని ఎప్పుడూ నిర్మించకూడదని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఇంట్లో అనవసరమైన ఖర్చులు, భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుందని చెబుతున్నారు. దీనితో పాటు దక్షిణం వైపు వంటగది ఉంటే.. కుటుంబ పెద్ద కీళ్లు, మోకాలి నొప్పితో బాధపడతాడని చెబుతున్నారు.

వంటిళ్లు దేవుని మందిరంతో సమానం.. అయితే చాలా మంది తెలియక ప్రస్తుత కాలంలో టాయిలెట్ వంటగదిముందు కడుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదంట. దీని కారణంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు దిగజారే అవకాశం ఉందంటున్నారు. ఇక వంటగదిలోని స్లాబ్ లేదా అల్మారాను దక్షిణం లేదా పడమర దిశలో ఉంచాలంట. మసాలా దినుసులను వాయువ్య దిశలో ఉంచితే మంచిదని చెబుతున్నారు.

చాలా మంది కిచెన్‌లో వస్తువులను ఎక్కడ పడితే అక్కడ సర్దేస్తారు. అలా కాకుండా పాత్రలను వెస్ట్ లేదా సౌత్ వెస్ట్ దిశలో ఉంచుకోవాలని పండితులు అంటున్నారు. ఇక వంటగదిలో ముఖ్యమైన వస్తువుల్లో మిక్సీ, ఫ్రిజ్, మైక్రోవేవ్‌లు ఒకటి. వీటిని ఉంచడానికి సరైన ప్లేసులు కూడా ఉన్నాయి. మిక్సీని సౌత్ ఈస్ట్ జోన్‌లో, ఫ్రిజ్‌ను నార్త్ వెస్ట్ జోన్‌లో ఉంచుకోవాలి. అవసరమైతే కిచెన్ లోపల.. నార్త్ వెస్ట్ జోన్‌లో ఫ్రిజ్‌ను ఉంచాలని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News