know what should be offered to lord hanuman blessings on tuesday: హిందూ ధర్మంలో మంగళవారం రోజును హనుమంతుడికి ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున హనుమాన్ భక్తులు ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఈ రోజు నిష్ఠతో పూజ చేస్తే.. జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి.. ఆంజనేయుడి ఆశీస్సులు లభిస్తాయని ఆందరూ భావిస్తారు. అయితే, మంగళవారం రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పురోహితులు చెబుతున్నారు. వాటిని పాటించకపోతే హనుమంతుడు అలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఫలితంగా ఆయన అనుగ్రహం లభించదు. ఆ నియమాలు, పూజా విధానం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
హనుమాన్ పూజా నియమాలు ఇవే..
మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరం, మల్లెనూనె బెల్లం, శెనగలు సమర్పించాలి. ఇలా చేయడం శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఎరుపు రంగు పువ్వులను సమర్పించి.. దీపం వెలిగించాలి. అనంతరం హనుమాన్ చాలీసా పఠించాలి. దీని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని భావిస్తారు. బలం, రక్షణ కోసం హనుమంతున్ని ప్రార్థించాలి. ఆలయంలో నూనె లేదా సింధూరం సమర్పించిన తర్వాత నేరుగా ఇంటికి తిరిగి రావాలి. పూజ సమయంలో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేసి హారతి ఇవ్వడం మర్చిపోకూడదు. మంగళవారం రోజున మాంసం, చేపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి వాటిని తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉంటూ.. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. స్వచ్ఛమైన ఆహారం మనస్సుకు ప్రశాంతత చేకూర్చి ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది. హిందూ పురాణాలు, శాస్త్రాల ప్రకారం.. మంగళవారం ఉపవాసం పాటించడం వల్ల అంగారక గ్రహం దుష్ప్రభావాలు తొలగిపోయి.. జీవితంలో విజయం లభిస్తుంది. ఉపవాసం పాటించే వ్యక్తి పండ్లు లేదా తేలికపాటి ఆహారాన్ని రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. ఉపవాస సమయంలో నిరంతరం హనుమంతుడి నామాన్ని జపించడం వల్ల ఇంట్లో శాంతి, సామరస్యం నెలకొంటాయి. మంగళవారం శివుడిని పూజించడం కూడా శుభప్రదంగా చెబుతారు. శివలింగానికి నీరు, పాలు లేదా గంధం సమర్పించాలి. ఈ
మంగళవారం ఏమి చేయకూడదంటే?
వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం అప్పు ఇవ్వకూడదు. పొరపాటున కూడా మంగళవారం రోజున ఎవరి దగ్గరా అప్పులు తీసుకోవద్దని.. అప్పు ఇవ్వొద్దని పురోహితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడంతో పాటు డబ్బుకు కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇక, రోజున అబద్ధాలు చెప్పడం లేదా కోపం తెచ్చుకోవడం పాపంగా చెబుతారు. ఎవరినీ విమర్శించడం లేదా అవమానించడం వంటివి అస్సలు చేయకూడదు. ఇనుమును దానం చేయకుండా.. దానికి బదులుగా బెల్లం లేదా ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం మంచిది. ఈ నియమాలను పాటించడం ద్వారా భక్తులు హనుమంతుడి అనుగ్రహానికి పాత్రులవుతారని పండితులు చెబుతున్నారు.


