Saturday, December 28, 2024
HomeదైవంKorutla: వైభవంగా అయ్యప్ప జాతర

Korutla: వైభవంగా అయ్యప్ప జాతర

అయ్యప్ప శరణు ఘోషతో..

కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని అయ్యప్ప గుట్టపై వెలసిన అయ్యప్ప స్వామికి జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

ఈ జాతర కార్యక్రమం సందర్భంగా ఉదయం పుణ్యాహవాచనంతో పూజారి కార్యక్రమాలను ప్రారంభించి పతాకావిష్కరణ చేసి అనంతరం అయ్యప్ప స్వామికి హారతి నిర్వహించారు. అనంతరం గణపతి హవనము చేశారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. మెట్ల పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ శాశ్వత అధ్యక్షులు చిద్రాల నారాయణ గురు స్వామి, ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాసులు పడి వెలిగించారు.

భజనలతో మార్మోగిన

పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు అయ్యప్ప గీతాలతో, భజన కార్యక్రమాలతో అయ్యప్ప గుట్ట ప్రాంతమంతా మారు మోగిoది. ఈ జాతర కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బిజెపి నాయకులు సురభి నవీన్, కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

50,000 మంది హాజరు

ఈ కార్యక్రమంలో దాదాపు 50 వేల మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంకాలం రథోత్సవం నిర్వహించారు. అనంతరం మహషి మర్ధన కార్యక్రమ నిర్వహించారు. ఈ జాతర కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షుడు నిమిష కవి నాగరాజు, ప్రధాన కార్యదర్శి తోటరాజు, కోశాధికారి జుంబర్తి రమేష్, ఆలయ కమిటీ సభ్యులు టేకుల నరేష్ లతో పాటు గురుస్వాములు శ్రీపతి రమేష్, పిన్నంశెట్టి శ్రీధర్, గట్ల ఆనంద్, జక్కుల ప్రసాద్, కుమారస్వామి, ముక్కెర చంద్రశేఖర్, పడాల గణేష్ తోపాటు అయ్యప్ప భక్తులు మాతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News