శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సెప్టెంబరు 7వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు.
టీటీడీ హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో ప్రతి ఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది.
శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా టీటీడీ శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూలమాలలతో అలంకారాలు చేపట్టనుంది. గోశాలలోని గోసంపదను అందంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సందర్శకులు గోశాలలో బెల్లం, బియ్యం, గోమాతలకు భక్తులు స్వయంగా తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది.
గోవుకు మేతదానం చేస్తే మహా పుణ్యఫలమని భక్తుల నమ్మకం. గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.