Mars Transit 2025 Effect: సెప్టెంబరులో కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. అలాంటి వాటిలో కుజుడు నక్షత్ర సంచారం ఒకటి. రెడ్ ఫ్లానెట్, గ్రహాల కమాండర్ గా పిలువబడే అంగారకుడు సెప్టెంబరు 3న చిత్త నక్షత్ర ప్రవేశం చేయనున్నాడు. ఈ ప్రభావం కొందరి జీవితాల్లో వెలుగులు తీసుకురాబోతున్నాయి. దీంతో వారి అదృష్టం మారబోతుంది. త్వరలో వారు ధనవంతులు కానున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
కుంభ రాశి
కుజుడి నక్షత్ర సంచార ప్రభావం కుంభ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలతలు తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది. మీ ప్రేమ సక్సెస్ అయి.. పెళ్లి వరకు వెళుతుంది. సంతాన యోగం కూడా ఉంది. కెరీర్ లో సడన్ గ్రోత్ ఉంటుంది. ప్రయాణాలు చాలా లాభాలను ఇస్తాయి. సమాజంలో మీ యెుక్క ఖ్యాతి పెరుగుతుంది. మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేస్తున్నవారికి కలిసి వస్తుంది. వారు ఊహించని లాభాలను పొందుతారు. ఎంతో కాలంగా వేచి చూస్తున్న ఉద్యోగం రానే వస్తుంది. జాబ్ చేసేవారికి జీతభత్యాలు పెరుగుతాయి. కొంత మందికి ప్రమోషన్ కూడా రావచ్చు.
మేష రాశి
కుజుడు చిత్ర నక్షత్ర ప్రవేశం మేషరాశివారికి ఎంతో మేలు చేస్తుంది. మీరు కెరీర్ లో ఎవ్వరూ అందనంత స్థాయికి చేరుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడటమే కాకుండా డబ్బును భారీగా పొదుపు చేస్తారు. మీరు చేపట్టే ప్రతికార్యంలోనూ అదృష్టం కలిసిరావడంతో విజయం మిమ్మల్నే వరిస్తుంది. జీవిత భాగస్వాముల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురినీ ఆకట్టుకుంటారు. మానసిక సమస్యల నుండి బయటపడతారు. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. ఎంతోకాలంగా అసంపూర్తిగా ఉన్న పనులు కంప్లీట్ అవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని ఫలితాలు ఉంటాయి.
Also Read: Shukra Gochar 2025- సొంతరాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి కుజుడు నక్షత్ర సంచారం అద్భుతంగా ఉండబోతుంది. మీ సంపాదన భారీగా పెరుగుతుంది. మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయం వచ్చి పడుతుంది. ఆఫీసులో మీ సహోద్యోగుల నుంచి సపోర్టు లభిస్తుంది. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. మీరు చేసే పనులతో నలుగురినీ ఆకట్టుకుంటారు. కష్టమైన పనులు కూడా ఎంతో సులభంగా చేస్తారు. ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్త వింటారు. దూర ప్రయాణాలు మీకు లాభాలను ఇస్తాయి. మీ కెరీర్ లో ఎన్నడూ చూడని పురోగతి ఉంటుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మీకు కోరుకున్న వారితోనూ వివాహం జరుగుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా ప్రయోజనాలు పొందుతారు.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను ఇవ్వడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.
Also Read: Radha Ashtami 2025 – రాధాష్టమి ఎప్పుడు ఆ రోజు ఏం చేయాలి


