Kuja Nakshatra Transit 2025: గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సైన్యాధిపతి అయిన కుజుడు కూడా త్వరలో నక్షత్రాన్ని మార్చబోతున్నారు. అంగారకుడు సెప్టెంబరు 23 మంగళవారం రాత్రి 9: 08 గంటలకు కుజుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. పైగా స్వాతి నక్షత్రానికి రాహువు అధిపతిగా భావిస్తారు. రాహువు నక్షత్రంలో కుజుడు సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
సింహ రాశి
సింహ రాశి వారికి కుజుడు నక్షత్ర సంచారం అద్భుతంగా ఉండబోతుంది. మీ కోరికలన్నీ తీరిపోతాయి. ఆర్థికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. కెరీర్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ముట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు మంచి రోజులు స్టార్ట్ కానున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది.
ధనస్సు రాశి
అంగారకుడు నక్షత్ర మార్పు ధనస్సు రాశివారికి లక్ ను తీసుకొస్తుంది. మీరు భారీగా స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. మీరు తీసుకునే ప్రతి ప్రాజెక్టును సక్సెస్ చేస్తారు. నలుగురిలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తోటి ఉద్యోగస్థుల నుంచి సహకారం అందుతుంది. మీ వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి జీవితం సంతోషంగా మారుతుంది.
Also Read: Bhai Dooj 2025-ఈ ఏడాది భాయ్ దూజ్ ఎప్పుడు? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు?
కన్యా రాశి
కుజుడు నక్షత్రం సంచారం కన్యారాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. మీరు ఆర్థికంగా మంచి ఫలితాలను పొందుతారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. సంసార జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే మంచి సమయం. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగుల పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లో ఊహించని పెరుగుదల ఉంటుంది.
Disclaimer: పైన ఇచ్చిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని రీడర్స్ ఆసక్తి మేరకు.. పండితులు, నిపుణులు సూచనలు తీసుకుని రూపొందించాం. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


