Ruchaka rajayogam effect: ప్రతి నెలా గ్రహాలు రాశులను మారుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో అవి కొన్ని శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. గ్రహాల కమాండరైన కుజుడు అక్టోబర్ 27న వృశ్చిక రాశి ప్రవేశం చేయనున్నాడు. అంగారకుడిని ధైర్యం, శక్తి మెుదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. కుజుడు రాశి మార్పు కారణంగా అరుదైన రుచక రాజయోగం రూపుదిద్దుకుంటుంది. ఈ యోగ ప్రభావం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి రుచక రాజయోగం ఎంతో మేలు చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కెరీర్లో విజయాలను అందుకుంటారు. అనుకున్న లక్ష్యాన్ని సకాలంలో సాధిస్తారు. రుణ విముక్తి నుండి బయటపడతారు. జాబ్ కు సంబంధించిన శుభవార్త వింటారు. సంతానం లేని వారికి పిల్లలు కలిగే అవకాశం ఉంది.
మేష రాశి
కుజుడు చేయబోతున్న రుచక రాజయోగం మేష రాశి యెుక్క ఆరో ఇంట్లో ఏర్పడబోతుంది. ఈ యోగ ప్రభావం వల్ల ఈ రాశి వారు ఊహించని ఫలితాలను పొందుతారు. ఆదాయం పెరగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ లో అనేక విజయాలను అందుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. పని చేసే చోట మీ బాస్ నుంచి ప్రశంసలు దక్కుతాయి.
Also Read: Today Horoscope – ఇవాళ ఈ రెండు రాశుల వారు గుడ్ న్యూస్ వింటారు.. ఇందులో మీది ఉందా?
కన్యా రాశి
రుచక రాజయోగంతో కన్యా రాశి వారి అదృష్టం మారపోయే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగ లేదా సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉంటుంది. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
Disclaimer: ఈ వార్త మత విశ్వాసాలు, పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. ఈ కథనానికి ఎలాంటి శాస్త్రీయత లేదు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


