Monday, January 13, 2025
HomeదైవంKumbh Mela TTD: మహా కుంభ మేళాలో శ్రీవారి నమూనా ఆలయం

Kumbh Mela TTD: మహా కుంభ మేళాలో శ్రీవారి నమూనా ఆలయం

సంగమ తీరంలో శ్రీవారి సేవలు

నేటి నుండి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి నమూన ఆలయాన్ని నాగ వాసుకి ఆలయ సమీపంలోని సెక్టార్-6 వద్ద ఆదివారం ప్రారంభించింది.

- Advertisement -

దర్శనాలు ప్రారంభం
ఇంజినీరింగ్ నిపుణులు, టీటీడీ సిబ్బంది నమూన ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉత్తరాది భక్తులకు కుంభమేళాలలో శ్రీవారి వైభవాన్ని తెలియజేసేందుకు టీటీడీ నమూన ఆలయాన్ని ఏర్పాటు చేసింది. నేటి నుండి కుంభమేళాకు వచ్ఛే భక్తులందరూ శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ముందుగా తిరుచ్చిపై స్వామి అమ్మవార్లను త్రివేణి సంగమం చెంతకు వెళ్లి పవిత్ర గంగా జలాలను కలషంలో నింపుకుని తీసుకువచ్చి ఆలయంలో ప్రోక్షణ చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం ఆలయంలో విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు.

ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీవారి చల ప్రతిష్ట, వాస్తు హోమం, నిత్య హోమం, ఇతర ప్రత్యేక పూజాది కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. అనంతరం కలషంలోకి ఆవాహన చేసిన పుణ్య జలాలతో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి నివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనాలకు అనుమతించి ప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమాల్లో హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీరామ్ రఘునాథ్, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News