శ్రీవీరభద్రస్వామివారికి 11లక్షల విలవైన వెండి ఆభరణాల బహుకరించింది ఓ భక్తుల కుటుంబం. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బొల్లం యాకయ్యలింగం-బారతలక్ష్మి దంపతుల కుమారులు బొల్లం నాగేశ్వరరావు-సరస్వతి, బొల్లం శివకుమార్-శ్రీలత, రవీందర్(లేట్)-లక్ష్మీ దంపతులు సుమారు 11 లక్షల రూపాయల వ్యయంతో కురవి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీవీరభద్రస్వామి వారికి వెండి సర్వాభరణాలను ప్రత్యేకంగా చేయించి, ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణకు అందజేశారు.
ఈ ఆభరణాలను ఆలయ అర్చకులు పవిత్ర వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ వీరభద్రస్వామి వారికి అలంకరింపజేసారు. సర్వాంగ ఆభరణాలతో స్వామివారు శోభాయమానంగా వెలిగిపోతు భక్తులకు దర్శనం ఇచ్చారు.
స్వామివారికి చిరకాలం గుర్తుండేలా వెండి సర్వాభరణాలు అందజేసిన బొల్లం నాగేశ్వరరావు-సరస్వతి దంపతులను పలువురు అభినందించారు.