Saturday, October 5, 2024
HomeదైవంKurnool: మహాశివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీ రూపాల సంగమేశ్వరుడు

Kurnool: మహాశివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీ రూపాల సంగమేశ్వరుడు

జగన్నాథ గట్టుపైన శివరాత్రి వైభోగం..

కర్నూలు నగర పరిధిలోని దిన్నే దేవరపాడు జగన్నాథ గట్టుపై వెలసిన శ్రీ ఉమాసమేత, రూపాల సంగమేశ్వర ఆలయం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన అభిషేకాలను చేస్తూ భక్తజనం మహాశివరాత్రి వేడుకలు జరుపుకునేందుకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. మార్చి 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసన్న లక్ష్మీ, నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే మహాశివరాత్రి వేడుకలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు, మహాశివరాత్రి వేడుకలకు ఆలయానికి రంగులు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు క్యూ లైన్ ల ఏర్పాటు, తాగడానికి మంచినీటి సౌకర్యం, చలువ పందిళ్లు ఏర్పాటు, ఆలయ అవరణ ప్రాంతంలో ట్రాక్టర్ తో చదును చేసి, కలుపు మొక్కల తీసివేత కార్యక్రమాన్ని చేపట్టారు. శివరాత్రి పర్వదినం రోజున ఆ పరమ శివున్ని దర్శనానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.

రాత్రి జాగరణ ఉండే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, దాత పెరుగు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తులకు ఏర్పాటు చేశారు.

మహాశివరాత్రి పర్వదినం రోజున దర్శనానికి వచ్చే భక్తులకు ఆర్టీసీ వారు కర్నూలు నుండీ జగన్నాథ గట్టుపైకి వచ్చేందుకు బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి అధ్యక్షులు పి నరసింహారెడ్డి, అర్చకులు లంక సురేష్ శర్మ, జూనియర్ అసిస్టెంట్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News