Lakshmi Narayan Rajyoga in Tula Rasi:వేద పంచాంగం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో కలిసి శుభ మరియు అశుభ రాజయోగాలను ఏర్పరుస్తాయి. వచ్చే నెలలో అలాంటి శుభకరమైన యోగమే బుధుడు, శుక్రుడు సృష్టించబోతున్నారు. నవంబరులో గ్రహాల యువరాజు బుధుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కలిసి అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నారు. ఐదేళ్ల తర్వాత తులరాశిలో ఈ రాజయోగం సంభవించబోతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
తులా రాశి
ఇదే రాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. దీని కారణంగా సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. మీ జీతం అమాంతం పెరుగుతుంది. పెళ్లి ప్రపోజల్ రావచ్చు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
కుంభ రాశి
కుంభరాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. విద్య లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
Also Read: Mars Transit 2025 – కుజుడు నక్షత్ర సంచారం.. నవంబర్ 01 నుండి ఈ 3 రాశుల సుడి తిరగబోతుంది..
మకర రాశి
బుధుడు మరియు శుక్రుడు సృష్టించిన రాజయోగం మకర రాశి వారి తలరాతను మార్చబోతుంది. కెరీర్ లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. బాస్ దృష్టిలో మీ ఇమేజ్ పెరుగుతుంది. మీ ఆస్తి భారీగా పెరుగుతుంది. జాబ్ ఛేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. పనిలో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఓ రేంజ్ లో పెరుగుతాయి. మీరు చేపట్టిన ప్రతి ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తారు.


