Saturday, November 15, 2025
HomeTop StoriesPlanetary 2025: నవంబర్‌లో ఈ 3 రాశులకు తిరుగుండదు.. వీరు పట్టిందల్లా బంగారమే..!

Planetary 2025: నవంబర్‌లో ఈ 3 రాశులకు తిరుగుండదు.. వీరు పట్టిందల్లా బంగారమే..!

Luck for these zodiac signs details in Telugu: నవంబర్ మాసం జ్యోతిష్య శాస్త్రం పరంగా అత్యంత కీలకమైనది. సూర్యుడు, శుక్రుడు వంటి ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చుకోవడం వల్ల ఈ ప్రభావం అనేక రాశులపై పడుతుంది. ఈ నెల అనేక రాశుల వారి జీవితాలపై సానుకూల ప్రభావం చూపనుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, నవంబర్ నెలలో అనేక ప్రధాన గ్రహాల కదలిక మారుతుంది. నవంబర్ 2న చంద్రుడు మీనరాశిలోకి, అదే రోజున శుక్రుడు తులారాశిలోకి సంచరిస్తాడు. ఆ తర్వాత నవంబర్ 10న బుధుడు వృశ్చికరాశిలో మారతాడు. ముఖ్యంగా నవంబర్ 11న గురుడు కర్కాటక రాశిలో వక్రగమనంలో కదులుతాడు. నవంబర్ 16న సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. చివరగా నవంబర్ 23న బుధుడు తులారాశిలోకి సంచరించి, నవంబర్ 29 వరకు అదే రాశిలో కొనసాగుతాడు. నెల చివరిలో శని మీనరాశిలో నేరుగా కదులుతాడు. ఈ గ్రహ మార్పులన్నీ కలిసి కొన్ని రాశులకు అద్భుతమైన ప్రయోజనాలను అందించనున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

- Advertisement -

అదృష్టం తలుపు తట్టే రాశులు ఇవే..

తులా రాశి
తులారాశి వారికి నవంబర్‌ నెల కొత్త ఆరంభాలకు సంకేతం. ఈ గ్రహాల సంచారం వలన మీ వృత్తి జీవితంలో మంచి గుర్తింపు వస్తుంది. మీరు చాలా కాలంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. కొన్ని అనుకోని ఆటంకాలతో నిలిచిపోయిన ఆర్థిక ప్రణాళికలు లేదా పనులు ముందుకు సాగుతాయి. కుటుంబంలో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్నవారు తమ జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకునే అవకవాశం ఉంది. ఈ నెల మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ గ్రహ సంచారాలు చాలా శుభప్రదమని చెప్పవచ్చు. ఈ మార్పు మీ పట్ల సానుకూలతను పెంచుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా పది మందిలో ఆకర్షనీయంగా కనిపిస్తారు. కళ, మీడియా లేదా అందానికి సంబంధించిన రంగాలలో ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. జీవిత భాగస్వామిపై ప్రేమ మరింతగా పెరుగుతుంది, పాత విభేదాలు సమసిపోతాయి. ఆర్థికంగా కూడా బలంగా తయారవుతారు. ఇతరుల సహకారం లభించి.. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.

కుంభ రాశి

ఈ రాశి వారు కెరీర్‌లో మంచి విజయాలు సాధిస్తారు. నవంబర్‌లో సంభవించే గ్రహ మార్పులు కుంభ రాశి వారికి చాలా ప్రత్యేకం. ఈ మార్పులు మీకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. కెరీర్‌ విషయంలో ఒక ముఖ్యమైన కెరీర్ నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు చాలా కాలంగా కృషి చేస్తున్న రంగంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శాంతి, సామరస్యం గణనీయంగా పెరుగుతాయి. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక స్థిరత్వం కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad