Saturday, November 15, 2025
HomeదైవంPalmistry: మీ అరచేతిలో ఈ గుర్తులున్నాయా..అయితే మిమ్మల్ని ఆపేవారే లేరు!

Palmistry: మీ అరచేతిలో ఈ గుర్తులున్నాయా..అయితే మిమ్మల్ని ఆపేవారే లేరు!

Lucky Palm Signs:మన అరచేతి రేఖలే..మన తలరాతల్ని చెబుతాయని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. అలాగే అరచేతిలోని రేఖలు, గుర్తులు మన జీవితాన్ని ప్రతిబింబిస్తాయని హస్తసాముద్రిక శాస్త్రం కూడా చెబుతోంది. ప్రతి వ్యక్తి చేతిలో ప్రత్యేకమైన రేఖలు, ఆకారాలు కనిపిస్తాయి. ఇవి వ్యక్తిత్వం, అదృష్టం, జీవన మార్గం వంటి విషయాలను తెలియజేస్తాయని విశ్వసిస్తారు. కొందరి అరచేతిలో ప్రత్యేక గుర్తులు ఉండటం వారు జీవితంలో సాధించే శ్రేయస్సుకు సంకేతమని నమ్మకం ఉంది. ఈ గుర్తులు కేవలం రేఖలు కాకుండా, మన భవిష్యత్తు గురించి కొన్ని సంకేతాలను ఇస్తాయని హస్తసాముద్రిక నిపుణులు వివరిస్తున్నారు.

- Advertisement -

చేప ఆకారం

అరచేతిలో చేపలాగే ఆకారం కనపడితే, అది శుభ సూచనగా చెబుతారు. అలాంటి వ్యక్తులు సాధారణంగా ఉద్యోగ రంగంలో లేదా ప్రభుత్వ సేవల్లో ఉన్నత స్థాయికి చేరతారని నమ్మకం. వీరికి కెరీర్‌లో ఎన్నో అవకాశాలు ఎదురవుతాయి, శ్రమకు తగ్గ ఫలితాలు దక్కుతాయి. చేప గుర్తు ఉన్నవారు తాము చేసే పనిలో నిబద్ధతతో ముందుకు సాగి, సక్సెస్‌ను సాధిస్తారని హస్తసాముద్రికులు పేర్కొంటారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/astrological-reasons-why-men-should-pierce-ears/

త్రిశూలం గుర్తు

అరచేతిలో త్రిశూలం ఆకారంలో రేఖ కనపడితే, అది అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది విజయం, కీర్తి, ధనప్రాప్తి వంటి ఫలితాలకు దారితీస్తుందని చెబుతారు. ఈ గుర్తు శివుని అనుగ్రహానికి చిహ్నంగా చెబుతారు. జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను అధిగమించి ముందుకు సాగే సామర్థ్యం వీరికి సహజంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు తాము చేసే పనుల ద్వారా సమాజంలో గౌరవాన్ని సంపాదిస్తారు.

ఓడ గుర్తు

అరచేతిలో ఓడ ఆకారంలో గుర్తు ఉన్నవారు జీవితంలో అనేక మార్పులను ఎదుర్కొంటారు. ఇది సముద్రయానం లేదా విదేశీ వ్యాపార అవకాశాలకు సంకేతమని అంటారు. అలాంటి వ్యక్తులు వ్యాపార రంగంలో వేగంగా ఎదుగుతారు, సంపదను సేకరిస్తారు. ఈ గుర్తు ఉన్నవారు ఏ రంగంలో ఉన్నా పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. అదనంగా, వీరికి విదేశీ సంబంధాల ద్వారా కొత్త అవకాశాలు దక్కవచ్చు.

కలశం ఆకారం

కలశం గుర్తు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. అలాంటి వ్యక్తులు మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. వీరి మనసు ఎల్లప్పుడూ దేవుని ధ్యానంలో ఉంటుంది. తమ చుట్టుపక్కల వారికి సానుకూల భావనను పంచడం వీరి లక్షణం. కలశం గుర్తు ఉన్నవారు ఆధ్యాత్మిక విషయాలలో లోతుగా ఆలోచిస్తారు. తమ జీవితాన్ని ఇతరులకు ఆదర్శంగా నిలపాలనే ఆలోచన వీరిలో ఉంటుంది.

చక్రం ఆకారంలో

అరచేతిలో చక్రం ఆకారంలో గుర్తు కనిపిస్తే, అది అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. అలాంటి వ్యక్తులు స్వతంత్ర ఆలోచనలతో ముందుకు సాగుతారు. వారు తమ నిర్ణయాలను ఇతరులపై ఆధారపడకుండా తీసుకుంటారు. చక్రం గుర్తు ఉన్నవారు సాధారణంగా ఉన్నత స్థాయిలో ఆలోచిస్తారు, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడగలరు. వీరికి తాము నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనవీరిలో ఎక్కువగా ఉంటుంది.

పల్లకి ఆకారం

పల్లకి ఆకారంలో గుర్తు అరచేతిలో కనపడితే, అది మహత్తరమైన అదృష్టానికి సూచన. అలాంటి వ్యక్తులు విలాసవంతమైన జీవితం గడుపుతారు. సౌకర్యాలు, ధనం, భోగాలు వీరిని ఎప్పుడూ వదలవు. వీరికి ఆర్థిక ఇబ్బందులు రావు. జీవితంలో ప్రతి దశలో సౌకర్యవంతమైన పరిస్థితులు ఉంటాయి. పల్లకి గుర్తు ఉన్నవారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు, విజయాన్ని నిరంతరంగా కొనసాగిస్తారు.

సూర్య రేఖ లేదా సూర్య గుర్తు

అరచేతిలో సూర్యుని ఆకారంలో రేఖ కనిపిస్తే, అది జీవితాన్ని వెలిగించే గుర్తుగా భావిస్తారు. అలాంటి వ్యక్తులు తక్కువ శ్రమతో పెద్ద విజయాలు సాధిస్తారు. వీరికి గౌరవం, ప్రతిష్ఠ, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. సూర్య రేఖ ఉన్నవారు ఏ రంగంలో పనిచేసినా, వారు ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలుస్తారు. తమ కృషి ద్వారా సమాజంలో గుర్తింపు పొందడం వీరికి సహజం. జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ముందుకు సాగుతారని నమ్మకం ఉంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/can-old-diyas-be-used-on-diwali-know-the-spiritual-significance/

హస్తసాముద్రిక నిపుణుల ప్రకారం, అరచేతిలో కనిపించే ఈ గుర్తులు కేవలం రేఖలు కాకుండా, జీవిత మార్గాన్ని సూచించే చిహ్నాలు. ప్రతి వ్యక్తి చేతిలోని ఈ ఆకారాలు వారి ఆలోచనా విధానం, ప్రవర్తన, ఆత్మవిశ్వాసం వంటి అంశాలను ప్రతిబింబిస్తాయి. కొంతమంది ఈ గుర్తులను విశ్వసిస్తారు, మరికొందరు వాటిని యాదృచ్ఛికంగా చూస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad